Begin typing your search above and press return to search.
జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు:జగన్
By: Tupaki Desk | 22 Sep 2018 11:28 AM GMTఏపీ ప్రతిపక్ష నేత - వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం భీమిలి నియోజకవర్గంలోని పప్పలవానిపాలెం క్రాస్ నుంచి 267వ రోజు పాదయాత్రను జగన్ ప్రారంభించారు. భారీ వర్షాల కారణంగా రద్దయిన ప్రజాసంకల్పయాత్ర శనివారం నుంచి యథాతథంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ను ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. పదవీ విరమణ చేసిన జర్నలిస్ట్ లకు నెలకు రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలని - జర్నలిస్ట్ చనిపోతే అతడి భార్యకు నెలకు 5 వేలు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఆ విజ్ఞప్తుల పై జగన్ సానుకూలంగా స్పందించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్ట్ లందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
పూర్తి అధ్యయనం చేసిన తరువాత పెన్షన్ ల విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జర్నలిజం విభాగాల్లో సాంకేతిక వనరుల కల్పనకు జగన్ హామీ ఇచ్చారు. జగన్ స్పందనపై ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు, జగన్ ప్రజాసంకల్పయాత్ర మరో చారిత్రక ఘట్టం వైపు అడుగులు వేస్తోంది. విశాఖ జిల్లాలో జననేత పాదయాత్ర తుదిఘట్టానికి రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో జగన్ పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. విజయనగరం జిల్లాలోని ఎస్.కోట నియోజకవర్గం అ అరుదైన ఘట్టానికి వేదిక కానుంది. వాస్తవానికి ఆ ప్రాంతం విజయనగరం జిల్లాలో ఉంది కానీ...విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వ్సతుంది. కాబట్టి, ఈ రెండు జిల్లాల పేర్లు చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నాయి.