Begin typing your search above and press return to search.
జగన్ మార్కు బదిలీలు... బాబు అధికారులకూ కీలక పోస్టింగ్ లు
By: Tupaki Desk | 2 Nov 2019 4:59 PM GMTఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పాలనలో తనదైన మార్కును చూపిస్తున్నారు. కీలక శాఖల బాధ్యతలు చూసే ఐఏఎస - ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తూ వస్తున్న జగన్... తన సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే కీలక పదవులు కేటాయిస్తున్నారన్న ఆరోపణలను ఆదిలో ఎదుర్కొన్నారు. అయితే రానురాను ఆ తరహా వైఖరికి జగన్ చాలా వ్యతిరేకమన్న భావన కూడా వ్యక్తమవుతోంది. అంతేకాకుండా గతంలో సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యవహరించిన ఆశ్రిత పక్షపాతానికి పూర్తిగా వ్యతిరేకంగా నడుస్తున్న జగన్... చంద్రబాబు మార్కుకు పూర్తిగా పాతరేశారన్న వాదనలు కూడా ఇప్పుడు బలంగానే వినిపిస్తున్నాయి.
సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కీలక శాఖల అధికారులను వరుసగా బదిలీ చేస్తూ వస్తున్న జగన్... తాజాగా శనివారం ముగ్గురు ఐఏఎస్ లు, ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఐదుగురు అధికారులను బదిలీ చేసిన జగన్... ఓ ఇద్దరు అధికారుల విషయంలో తీసుకున్న స్టాండ్ మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది. చంద్రబాబుకు అనుంగుడిగా, ఆయన సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారిగా పేరొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్రకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఉన్నతవిద్యా శాఖతో పాటు ప్రస్తుతం కీలకంగా మారిన నైపుణ్యాభివృద్ధి శాఖల బాధ్యతలను సతీష్ చంద్రకు అప్పగించిన జగన్... ఏ వర్గానికి చెందిన అధికారి అయినా తాను పక్షపాతం చూపేది లేదని తేల్చేసినట్టుగా విశ్లేషణలు వస్తున్నాయి. ఇక చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఎన్వీ సురేంద్రబాబుకు కూడా జగన్ సర్కారు ఎస్పీఎస్ అడిషనల్ డీజీపీగా కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ పదవిలో కూర్చునే సురేంద్ర బాబు... జగన్ హయాంలో కీలకంగా మారిన ఇసుక అక్రమ తవ్వకాలు, అబ్కారీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారట.
ఇక మిగిలిన ముగ్గురు అధికారుల విషయానికి వస్తే... గ్రామ, వార్డు వాలంటీర్ల విభాగం ఇన్ ఛార్జిగా కె.కన్నబాబును నియమించిన జగన్... మరో సీనియర్ ఐఏఎస్ అధికారి జే.ఎస్.వి. ప్రసాద్ ను సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ బదిలీలను చూస్తుంటే... జగన్ ను అందుకోవడం చంద్రబాబును దుస్సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు హయాంలో సీఎం పేషీలో నలుగురు ఐఏఎస్ లు ఉంటే... ఆ నాలుగు పోస్టులను తన సొంత సామాజిక వర్గానికి కేటాయించేసిన చంద్రబాబు... ఇతర సామాజిక వర్గాలకు చెందిన అధికారులను దాదాపుగా పక్కనపెట్టేశారన్న ఆరోపణలున్నాయి. అయితే అందుకు విరుద్దంగా చంద్రబాబు జమానాలో ఆయన మనుషులుగా చక్రం తిప్పిన సతీష్ చంద్ర, సురేంద్రబాబు వంటి అధికారులకు తన హయాంలోనూ కీలక శాఖల బాధ్యతలను అప్పగించిన జగన్.. చంద్రబాబు అండ్ కోకు నోట మాట రాకుండా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.