Begin typing your search above and press return to search.
రేపు జగన్ సీఎం అయితే.. అడుగుపెట్టడా?
By: Tupaki Desk | 15 Oct 2015 5:38 PM GMTరాజకీయాల్లో బండ్లు ఓడలు కావడం, ఓడలు బండ్లు కావడం చాలా సహజం. వైఎస్ జగన్మోహనరెడ్డి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి అయిపోతాననే మొన్నటి ఎన్నికల్లో అనుకున్నారు. కానీ అనుకున్నట్లుగా జరగలేదు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ఇవాళ సీఎం చంద్రబాబునాయుడు అమరావతి రాజధానికి శంకుస్థాపన చేస్తుండగా.. తనను ఆ కార్యక్రమానికి పిలవొద్దని, పిలిచినా తాను రానని.. జగన్మోహనరెడ్డి తెగేసి చెప్పేశారు. పైగా తాను రాదలచుకోకపోవడానికి 8 కారణాలను కూడా వల్లించారు. బాగానే ఉంది. ఆయన కారణాలు ఆయన ఇష్టం.
మరైతే ఇప్పుడు తెలుగు ప్రజలకు మరో కీలకమైన సందేహం కలుగుతోంది. అక్కడ రైతుల ఉసురు పోసుకుని రాజధాని కడుతున్నారు.. తప్ప ప్రజల ఆమోదంతో కాదని అలాంటి చోట తాను అడుగుపెట్టనని జగన్ తన లేఖలో చాలా భీషణ ప్రతిజ్ఞలు చేశారు బాగానే ఉంది. మరోవైపు 2018 నాటికి ప్రాథమికంగా ఒక దశ వరకు రాజధాని నిర్మాణ పనులను పూర్తిచేసి ప్రజలకు కానుకగా అందించాలని కూడా చంద్రబాబు చాలా తొందరపడుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే 2018 నాటికి ఒక దశ రాజధాని పూర్తయినదనే అనుకుందాం.
పరిస్థితుల్లో తేడా వచ్చి 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడనే అనుకుందాం. అప్పుడు జగన్ ఏం చేస్తారు. అప్పటికే సగం రాజధాని పూర్తయిపోయి ఉంటుది. అసెంబ్లీ, సెక్రటేరియేట్, రాజ్‌భవన్ ఇలా.. రాష్ట్ర పరిపాలన మొత్తం అక్కడే కేంద్రీకృతం అయి ఉంటుంది. అలా ప్రజల ఉసురు మీద నిర్మించినరాజధాని గనుక.. తాను ఆ అమరావతి నగరంలోనే అడుగుపెట్టను అంటూ.. తెలంగాణలోని లోటస్‌పాండ్ నుంచి గానీ.. బెంగుళూరు లోని తన రాజసౌధం నుంచి గానీ పాలన సాగిస్తార? అనేది ప్రజలకు సందేహం కలుగుతోంది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న తీరు గమనించి ఆయనకు ఓర్వలేనితనం హెచ్చిపోయి ఉండవచ్చు. అంతమాత్రాన.. ఊరిమీద అలిగిన వాడు చెరువు మీద కోపం చూపించినట్లుగా.. తాను అసలు కార్యక్రమానికే రానని అనడం సబబు కాదు. కాస్త తర్కబద్ధంగా ఆలోచించి జగన్ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. కానీ.. ఇప్పుడు ఆయన తన నిర్ణయాన్ని సరిదిద్దుకోవడం కూడా కుదరకపోవచ్చు.