Begin typing your search above and press return to search.
జగన్ సంచలనం: ఏపీకి మూడు రాజధానులు
By: Tupaki Desk | 17 Dec 2019 1:31 PM GMTఏపీలో ప్రభుత్వం మారి కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి ఏపీ రాజధాని అమరావతియేనా? కాదా? అన్నది ఏపీలో మోస్ట్ పాపులర్ ప్రశ్నగా... బిగ్ డైలమా నిలిచింది. మంత్రుల ప్రకటనలు, రాజధానిలో నిర్మాణాలు నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం వంటి ప్రకటనలతో అమరావతి మార్పు తథ్యమనే ఎక్కువ మంది నమ్మారు. అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ అంచనాలు - భయాలు - ప్రశ్నలు అన్నిటికీ జగన్ చెక్ పెట్టేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరిరోజున జగన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
అమరావతి రాజధానిగా కొనసాగతుుంది. అయితే... చంద్రబాబు ప్రచారం చేసినట్లు మాత్రం కాదు. జగన్ అసెంబ్లీలో ఏమన్నారంటే... ప్రజలకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటామని, రెండు సంస్థలతో అధ్యయనం చేయిస్తున్నామని... త్వరలో నివేదిక వస్తుందని జగన్ వెల్లడించారు. సౌతాఫ్రికా మోడల్ లో ఏపీకి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత రాజధాని అమరావతిని చట్ట సభులతో కూడిన రాజధాని కొసాగించాలనుకుంటున్నట్లు జగన్ చెప్పారు. మరోచోట చట్టసభలు కట్టడానికి ప్రభుత్వానికి భారమనే ఉద్దేశంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. విశాఖలో మౌలిక వసతులు సంపూర్ణంగా ఉన్న నేపథ్యంలో దానిని ఉపాధి ఉద్యోగ కల్పన రాజధానిగా తీర్చిదిద్దితే బాగుంటుంది అనుకుంటున్నట్లు సీఎం చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణలో రాయలసీమకు కూడా మేలు జరిగేలా జుడీషియల్ క్యాపిటల్ కర్నూలులో పెడితే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారికి న్యాయం జరిగినట్లు అవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇంతవరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదని, నివేదికలు వచ్చాక ఆ సలహాలను బట్టి ప్రజామోదమైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు .