Begin typing your search above and press return to search.
జగన్ లక్ష్యం!... ఏపీకి ప్రత్యేక హోదా సాధన!
By: Tupaki Desk | 2 March 2019 7:00 AM GMTవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వ్యూహం ఏమిటో?, తన భవిష్యత్తు లక్ష్యం ఏమిటో?, అంతిమంగా రాష్ట్ర ప్రజల లక్ష్యం ఏమిటో? కూడా చెప్పేశారు. నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లిన జగన్... అక్కడ జరుగుతున్న *ఇండియా టుడే కాన్ క్లేవ్*లో కీలక ప్రసంగమే చేశారు. ఇండియా టుడే టీవీ ప్రతినిధి సంధించిన ఏ ఒక్క ప్రశ్నకు స్కిప్ చేయకుండా అన్ని ప్రశ్నలకు ఓపిగ్గానే కాకుండా చాలా క్లారిటీగా సమాధానాలు ఇచ్చిన జగన్... వచ్చే ఎన్నికల్లోనే కాకుండా ఆ తర్వాత కూడా తన వ్యూహంపై పూర్తి స్థాయి క్లారిటీ ఉన్నట్లుగా చెప్పకనే చెప్పేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పిన జగన్.. ఈ దిశగా ఉద్యమాలు చేస్తున్నట్లుగా పలు పార్టీలు ఆడుతున్న నాటకాలను కూడా తనదైన శైలిలో ఎండగట్టారనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ విజయం సాధించడం ఖాయమేనని చెప్పిన జగన్... జాతీయ రాజకీయాలపై తన వ్యూహాన్ని కూడా ప్రకటించేశారు.
జాతీయ స్థాయి రాజకీయాల్లో ఇప్పటిదాకా తాము ఏ ఒక్క పార్టీతోనూ పొత్తు యపెట్టుకోలేదని చెప్పిన జగన్... ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్న కూటమి ఏదైనా తమ ముందుకు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టమైన హామీ ఇస్తే.. ఆ కూటమికి తమ పార్టీ మద్దతు ప్రకటిస్తుందని ఆయన చాలా క్లియర్‌గా చెప్పారు. ఈ విషయంలో మరో మాటకు తావు లేదని కూడా జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నది తమ రాష్ట్ర ప్రజల లక్ష్యమని, ప్రజల లక్ష్యమే తమ లక్ష్యమని, ఆ లక్ష్యసాధనే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతామని కూడా జగన్ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అయినా కూడా ఆ పార్టీ నేతృత్వంలోని కూటమికి కూడా మద్దతు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా జగన్ తేల్చి చెప్పారు. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా, రాజకీయ నేతగా తనకంటూ ఏ ఒక్కరి మీదో, ఏ ఒక్క పార్టీ మీదో తనకు ధ్వేషం ఉండదని చెప్పిన జగన్... తన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటు పడతామని చెప్పే పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని జగన్ స్పష్టం చేశారు.
తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వైనం, తనపై నమోదైన కేసులు, వాటి దర్యాప్తు తదితర అంశాలపైనా జగన్ చాలా క్లారిటీగానే మాట్లాడారని చెప్పాలి. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం తనపై కేసులు లేవని, అయితే తన తండ్రి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర నిర్వహిస్తానని తాను ప్రతిపాదించగానే తనపై కేసులు నమోదైపోయాయని జగన్ చెప్పారు. ఈ కేసుల నమోదులోనూ చాలా మతలబులు ఉన్నాయని చెప్పిన జగన్... తనపై కేసు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ కూడా లేని ఓ లేఖ రాయగా, దానిలో తనను ఇంప్లీడ్ చేసుకోవాలని టీడీపీ కోరిందని,. ఈ లెక్కన తనపై కేసులు నమోదు చేయించడంలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి కుట్ర పడ్డాయని ఆయన ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటన్న విషయంపైనా జగన్ తనదైన శైలిలో స్పందించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శకం ముగిసిపోయిందని, ఆ పార్టీ ఏపీలో కోలుకోవడం అసాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టేశారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అవినీతి పాలన సాగిస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ.... చంద్రబాబు సర్కారు అవినీతిపై ఏకంగా ఓ పుస్తకాన్నే అచ్చేసిందని, ఆ పుస్తకం కవర్ పేజీపై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బొమ్మ కూడా ఉన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. అవినీతి ముఖ్యమంత్రి అని ప్రచారం చేసిన నోటితోనే టీడీపీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని కూడా జగన్ తనదైన శైలి ప్రశ్నను సంధించారు. మొత్తంగా వచ్చే ఎన్నికలతో పాటు ఆ తర్వాత కూడా వైసీపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని ఢిల్లీ వేదికగా జగన్ చాలా క్లారిటీగానే చెప్పారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.