Begin typing your search above and press return to search.
జగన్ దీక్ష.. 'ఆరు' పరిణామాలు
By: Tupaki Desk | 12 Oct 2015 1:39 PM GMTఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేపట్టిన ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష.. ఆరో రోజులైంది. రోజులు గడుస్తున్న కొద్దీ.. జగన్ ఆరోగ్యం ఆందోళకరంగా మారటం ఇప్పుడు కొత్త ఉద్రికత్తలకు దారి తీస్తోంది. మొదటి నాలుగు రోజులకు భిన్నంగా.. ఆది.. సోమవారాల్లో జగన్ ఆరోగ్యం భారీగా క్షీణిస్తుందని చెబుతున్నారు.
తాజాగా చోటు చేసుకున్న "ఆరు" పరిణామాలు చూస్తే..
1. జగన్ చేపట్టిన నిరాహార దీక్ష శిబిరం వద్ద ఒక యువకుడు ఆత్మాహత్య యత్నం చేయటం కలకలం రేపింది. తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని.. నిప్పు అంటించుకునే ప్రయత్నం చేసిన ఒక యువకుడ్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అడ్డుకొని ఆపారు. దీంతో.. ఆ యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజా ఘటన నేపథ్యంలో. జగన్ దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
2. ఆరు రోజుల దీక్షతో బరువు తగ్గిన జగన్.. తాజాగా మరింత బరువు తగ్గారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రానికి ఆయన 200 గ్రాముల బరువు తగ్గారు
3. ఇక.. ఆయన ఆరోగ్య పరిస్థితి చూస్తే.. బీపీ 130/90 కాగా.. పల్స్ రేట్ 80కి పడిపోయింది.
4. ఆరో రోజుకు చేరుకున్న జగన్ దీక్షతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. ఆయన మరింత నీరసంగా ఉండటంతో పాటు.. వీలైనంత ఎక్కువసేపు పడుకునే ఉన్నారు. ఆయన ఓపిక బొత్తిగా లేదన్నట్లుగా జగన్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తోంది.
5. జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో ఆయన కుటుంబ సభ్యుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. పార్టీ శ్రేణులు సైతం జగన్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఇక.. జగన్ తల్లి విజయమ్మ హైదరాబాద్ నుంచి బయలుదేరి గుంటూరు చేరుకున్నారు. బెంగళూరులో ఉన్న జగన్ సోదరి షర్మిల కూడా పయనమయ్యారు. ఆమె కాసేపట్లో గుంటూరు చేరుకోనున్నారు.
6. క్రమక్రమంగా క్షీణిస్తున్న ఆరోగ్యం కాస్తా ఆందోళనకరంగా మారటంతో పార్టీ శ్రేణులు కలత చెందుతున్నాయి. ముఖ్యనేతలు కొందరు దీక్ష విరమించే విషయంపై మాట్లాడుతున్నా.. జగన్ మాత్రం ససేమిరా అంటున్నారని.. ఈసారి ఏదో ఒకటి తేల్చుకుంటానన్న ధోరణితో జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు.