Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వ్యూహం!..ఎస్సీ ఎస్టీ డిక్ల‌రేష‌న్‌ పై రేపు చ‌ర్చ‌!

By:  Tupaki Desk   |   24 Oct 2017 4:38 AM GMT
జ‌గ‌న్ వ్యూహం!..ఎస్సీ ఎస్టీ డిక్ల‌రేష‌న్‌ పై రేపు చ‌ర్చ‌!
X
2019లో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ అదిరిపోయే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ఓటు బ్యాంకుగా ఇప్ప‌టి వ‌ర‌కు భావిస్తున్న కొన్ని వ‌ర్గాల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకొనేందుకు జ‌గ‌న్ ప‌టిష్ట‌మైన వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. నాలుగు రోజుల కింద‌ట బీసీల‌తో విజ‌య‌వాడ‌లో భేటీ అయిన జ‌గ‌న్ వారి సాద‌క బాధ‌ల‌ను ప‌రిశీలించారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే బీసీ డిక్ల‌రేష‌న్‌ పైనా ఆయ‌న దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే బీసీ నేత‌ల‌ను రంగంలోకి దింపి.. మ‌రింత లోతుగా బీసీలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు తెలుసుకోవాల‌ని ఆదేశించారు. దీంతో ఇప్ప‌టికే బీసీ నేత‌లు ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటున్నారు. ఈ ప‌రిణామంతో ఉలిక్కిప‌డ్డ టీడీపీ అప్ప‌ట్లోనే జ‌గ‌న్‌ పై ఎదురుదాడికి దిగింది. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ మ‌రో వినూత్న అడుగు వేశారు. స‌మాజంలో వెనుక‌బ‌డిన ఎస్సీ ఎస్టీ వ‌ర్గాల‌పై దృష్టి పెట్టారు.

వాస్త‌వానికి వైసీపీకి ఎస్సీ - ఎస్టీ వ‌ర్గాలు అండ‌గానే ఉంటున్నాయి. అయినా కూడా వారి స‌మ‌స్య‌ల‌పై మ‌రింత అధ్య‌య‌నం జ‌ర‌గాల‌ని - వారిని మరింత‌గా ఆదుకోవాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎస్సీ - ఎస్టీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించాల‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 25న ఆయ‌న ప్ర‌త్యేకంగా భేటీ కావాల‌ని భావిస్తున్నారు. ఎస్సీ - ఎస్టీ డిక్ల‌రేష‌న్‌ పై చర్చించేందుకు ఈ నెల 25న పార్టీ రాష్ట్ర ఎస్సీ - ఎస్టీ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 10:00 గంటల నుంచి 11:30 గంటల వ‌ర‌కు ఈ స‌మావేశం జరుగుతుందని వైఎస్సార్‌ సీపీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎస్సీ - ఎస్టీ ముఖ్యనాయకులు సమావేశానికి హాజరు కావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఎస్సీ - ఎస్టీల సంక్షేమం - అభివృద్ధి అంశాల‌మీద పార్టీ మేనిఫెస్టోను నిర్ణ‌యించే బాధ్య‌త నాయ‌కుల‌కు అప్పగించనున్నారు. ఎస్సీ - ఎస్టీ డిక్ల‌రేష‌న్‌ లో ఏమేమి ఉండాలనే దానిపై సలహాలు - సూచ‌న‌లు ప్ర‌జ‌ల నుంచి, ఆయా వ‌ర్గాల నుంచి తీసుకునే బాధ్య‌త కూడా నాయకులకు అప్పగిస్తారు. అదేవిధంగా ముస్లిం - మైనార్టీ డిక్ల‌రేష‌న్‌ పై ఏయే అంశాలు ఉండాలనే దానిపైనా ఈ నెల 25న పార్టీ కేంద్ర కార్యాల‌యంలో చ‌ర్చ జరగనుంది. బుధవారం ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు ఈ సమావేశం జరుగుతుంది. ముస్లిం మైనార్టీల సంక్షేమం - అభివృద్ధి అంశాల‌మీద పార్టీ మేనిఫెస్టోను నిర్ణ‌యించే బాధ్య‌తను నాయ‌కుల‌కు అప్పగిస్తారు. మొత్తానికి ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తుంటే జ‌గ‌న్ దూకుడుమీద ఉన్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌, ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత‌ల‌కు కంటిపై కునుకు కూడా ప‌ట్టే అవ‌కాశం ఉండ‌ద‌ని చెబుతున్నారు. మ‌రి రాబోయే రోజుల్లో జ‌గ‌న్ ఇంకెంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారో చూడాలి.