Begin typing your search above and press return to search.
కడప ఉక్కు ఫ్యాక్టరీపై జగన్ తాజా ట్వీట్
By: Tupaki Desk | 15 Jun 2018 5:33 AM GMTప్రధాని మోడీపైనా.. ఆయన ప్రభుత్వంపైనా వ్యతిరేకత పెంచేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం చేజార్చుకోవటం లేదు. నాలుగేళ్ల బాబు పాలనలో అవినీతి.. అక్రమాలు భారీ ఎత్తున నడిచిన క్రమంలో తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటంతో పాటు.. ప్రజలు తన తప్పుల్ని ఎత్తి చూపించకుండా ఉండేందుకు వీలుగా భావోద్వేగ అంశాల్ని తెర మీదకు తెస్తున్నారు సీఎం చంద్రబాబు.
ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకురావటం.. రచ్చ చేయటం.. ప్రజల్లో భావోద్వేగాల్ని టచ్ చేసేలా చేసి పబ్బం గడుపుకోవాలన్న ఆలోచన ఎక్కువగా కనిపిస్తోంది. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను జగన్ ఎప్పటి నంచో చేస్తున్నారు. అయితే.. దీనిపై మోడీ సర్కారు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో హడావుడి చేస్తున్న బాబు సర్కారు.. నాలుగేళ్లుగా ఏం చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది.
మిత్రుడిగా ఉన్న వేళ కడప ఉక్కు ఫ్యాక్టరీపై సానుకూల నిర్ణయం వెలువడేలా పావులు కదపని బాబు.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కడపలో ఉక్కుఫ్యాక్టరీపై తమకే కమిట్ మెంట్ ఉన్నట్లుగా టీడీపీ చేస్తున్న ప్రయత్నాల్ని పలువురు తప్పు పడుతున్నారు.
తాజాగా కడపలోని ఉక్కు ఫ్యాక్టరీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ట్వీట్ క్లారిటీ ఇచ్చారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏపీ ప్రజలు అసలైన ఆకాంక్షగా ఆయన వ్యాఖ్యానించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ చూస్తే.. ఏపీ సంక్షేమం పట్ల మోడీ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధిపై సందేహం కలుగుతుందన్నారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం తీరు మొదటి నుంచే తెలిసినా కిమ్మనకుండా ఉన్న బాబు సర్కారు ఇప్పుడు మాత్రం ఆందోళనలు చేయటం చూస్తే.. ప్రజల్ని మోసం చేయటమే లక్ష్యమన్నట్లుగా ఉందన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీపై మోడీ సర్కార్ స్పష్టమైన నిర్ణయాన్ని వెలువరించారంటూ ట్వీట్ డిమాండ్ చేశారు.