Begin typing your search above and press return to search.
బాబు బ్యాచ్ మట్టి బిజినెస్ గుట్టు విప్పిన జగన్
By: Tupaki Desk | 23 April 2018 12:19 PM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాలుగేళ్ల బాబు పాలన గురించి ఘాటు విమర్శలు చేసిన జగన్.. పరిస్థితి ఎలా ఉందంటే.. గుడినే కాదు గుడిలో లింగాన్ని కూడా మింగేసిన చందంగా ఉందన్నారు. నీరు చెట్టు పథకం కింద ఇసుక.. మట్టిని ఆక్రమంగా తరలిస్తున్నారని జగన్ మండిపడ్డారు.
తన పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరంలోని బ్రహ్మలింగయ్య చెరువును జగన్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఏపీ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నీరు చెట్టు పథకం కింద టీడీపీ నేతలు భారీగా లబ్థి పొందారన్నారు. మట్టి వ్యాపారం ఎలా చేయాలో టీడీపీ నేతలకు బాగా తెలుసన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి నివాసానికి 35 కిలోమీటర్ల దూరంలో మట్టి దోపిడీ సాగుతుంటే అధికారులకు పట్టటం లేదని.. ఇది చూస్తేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పొచ్చన్నారు. సహజ వనరుల దోపిడీ టీడీపీ హయాంలో ఎక్కువగా జరిగిందన్నారు. కింది స్థాయి నుంచి మఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రి లోకేశ్.. సీఎం చంద్రబాబు వరకూ కమిషన్లు ముడుతున్నాయన్నారు. దారుణమైన అక్రమ ఇసుకు వ్యాపారం రాష్ట్రంలో జోరుగా సాగుతుందని.. ఇలా జరిగితే రాష్ట్రం ఏం బాగుపడుతుందని ఫైర్ అయిన జగన్.. బాబు పాలనతో రాష్ట్రం స్కామాంధ్ర ప్రదేశ్ గా మారిందన్నారు.
తన పాదయాత్ర వస్తుందన్న ఉద్దేశంతో మట్టి తవ్వకాల్ని ఆపేశారని.. నిత్యం వందలాది ఇసుక లారీలు దోచుకెళుతున్నట్లుగా మండిపడ్డారు. మట్టిని తవ్వేందుకు దేవాలయాలు అడ్డు వస్తుంటే అందులోని విగ్రహాల్ని రాత్రికి రాత్రి తరలించేస్తున్నారని ఫైర్ అయ్యారు.