Begin typing your search above and press return to search.
ఎన్నికల మాటెత్తకుండా జగన్ మాట్లాడలేడా?
By: Tupaki Desk | 1 Oct 2015 5:30 PM GMT'అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..' అనే పాట బహుశా ఈ పాటికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డికి కంఠతా వచ్చేసి ఉండాలి. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సమయానికి ఆయన పోలీసులతో పెనగులాడుతూ.. నేను దీక్ష విరమించేది లేదంటే లేదని వాగ్వివాదానికి దిగుతూ.. నానా బీభత్సాన్ని సృష్టిస్తూ ఉండాలి. 26వ తేదీన అన్నీ అనునన్నట్లుగా జరిగి ఆయన దీక్ష మొదలై ఉంటే గనుక.. ఈ పాటికి దీక్షను విరమింపజేయడానికి పోలీసులు 'యాక్షన్'లోకి దిగి ఉండాల్సిన సమయం ఇది. కానీ అసలు దీక్షే లేకుండాపోయింది. ఈలోగా సమయాన్ని మాత్రం వృథా చేయడం ఇష్టం లేని జగన్.. ప్రకాశం జిల్లాలో ఇటీవల ఆత్మహత్యలు చేసుకుని మరణించిన పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్లారు.
నిజానికి ఈ విషయంలో ఆయన ఒకింత ఆలస్యం చేశారనే చెప్పాలి. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు జరిగిన ఒకటిరెండు రోజుల వ్యవధిలోనే.. రాష్ట్ర మంత్రులు వారి కుటుంబాలను పరామర్శించి.. ప్రభుత్వం తరఫున సహాయాన్ని అందించి వచ్చారు. ఆతర్వాత రోజుల వ్యవధిలోనే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా వచ్చి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. రంగుమారిన పొగాకు మొత్తాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా చెప్పారు. పొగాకు రైతులు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవల్సిన అవసరం లేదన్నట్లుగా ఆమె హామీలు ఇచ్చి వెళ్లారు. చిట్టచివరగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వెళ్లారు. ఆయన ఏదో పరామర్శించి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. వారిచ్చిన హామీలునమ్మశక్యంగా లేవంటూ.. తనకు తోచిన విమర్శలన్నీ చేశారు.
అయితే పనిలో పనిగా.. రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయనే తన స్వప్నాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా మీడియాతో పంచుకున్నారు. రైతుల్ని పరామర్శించిన సమయంలోనే.. రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయని.. ఆ ఎన్నికల్లో ప్రజలు , రైతులు అధికార తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపేయబోతున్నారని జగన్ సెలవిచ్చారు. రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర&్పడి ఇప్పుడిప్పుడే 15 నెలలు పూర్తవుతున్నాయి. అప్పుడే అయిదేళ్ల పదవీకాలం ముగిసిపోయినట్లుగా.. ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయని ప్రతిపక్ష నేత ఆశల్ని వెలిబుచ్చడం అతిశయం గాక మరేంటి? పైగా అది ఆయనకు తొలిసారి కాదు.. చాన్నాళ్ల ముందునుంచే త్వరలో ఎన్నికలు వస్తున్నాయి.. మా ప్రభుత్వం ఏర్పడుతుంది? అంటూ జగన్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా ఆయనకు జనం మీద కాకుండా.. ఎన్నికల మీద మాత్రమే ప్రేమ ఉన్నదనే సంకేతాల్ని ప్రజల్లోకి పంపే పరిస్థితికి దారితీస్తోంది.
కనీసం ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో అయినా.. జగన్ కేవలం వారి కన్నీరు తుడిచే ప్రయత్నంతో సరిపెట్టి, ఎన్నికల మాటెత్తకుండా ఉంటే చాలా గౌరవంగా ఉండేదని.. 'త్వరలో ఎన్నికలు వస్తాయి' అని ఆయన అంటున్న కొద్దీ.. 'ఎన్నికల కోసమే జగన్ ఇదంతా చేస్తున్నారనే' దురర్థాలు వస్తాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్ ఎన్నికల జపం మానేసి.. ప్రజల్లో తిరుగుతూ ఉంటే పార్టీ గౌరవం పెరగుతుందని అనుకుంటున్నారు.