Begin typing your search above and press return to search.
ఒకేఒక్కడు... జగన్ !
By: Tupaki Desk | 14 May 2018 12:32 PM GMTవేసవి. పైగా కోస్తా ప్రాంతం. బయటకు పోవాలంటే... ప్రతి రోజూ ఎండలో పనిచేసే వారు కూడా జంకే పరిస్థితి. నాలుగడుగులు వేస్తే చొక్కా తడిసే చెమటలు. కానీ... అలుపు ఎరుగని పోరాటి పటిమతో జగన్ అడుగులేశాడు. అతనిపై జనం చూపే అభిమానం అతని మిగతా ఇబ్బందులను పక్కకు నెట్టేసింది. కనీసం ఆ తలపు కూడా రానీయ లేదు. అంతే ప్రజాభిమానం అంటే అలాగే ఉంటుంది. మనల్ని ప్రేమించేవారు తోడుంటే ఎలాంటి కష్టమయిన పనులైనా అలా జరిగిపోతాయంతే!
రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిన సమయంలో అనుభవజ్ఞుడు - మన తలరాతలు మారుస్తాడని అధికారం ఇస్తూ జీవితంలో ఏ మార్పూ చూపించని చంద్రబాబును జనం అర్థం చేసుకున్నారు. అందుకే ప్రజల సంకల్పం నెరవేర్చడానికి నవంబర్ 6, 2017 న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర.. సోమవారం (161వ రోజున) 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గం, వెంకటాపురంలో 2000 కిలోమీటర్ల పైలాన్ ఆవిష్కరిస్తూ...అశేష జనవాహినికి కృతఙ్ఞతలు తెలిపారు జగన్.
తన చెమట చుక్కలతో పార్టీపై ప్రతిపక్షాలకు తనపై ఉన్న తేలిక అంచనాలను పటాపంచలు చేసి ఏపీకి ఒకే ఒక్కడిగా నిలిచాడు జగన్. చంద్రబాబు కంచుకోటల్లో, జన సేన ఆస్థాన జిల్లాల్లో జగన్‌కు వస్తున్న ఆదరణే ఏపీ భవిష్యత్తు ఏంటో తేల్చేస్తోంది. ఇపుడు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల ఫలితాలపై ఎవరికీ అనుమానాల్లేవు. దానికి 2000 మైలు రాయి వద్ద జనం పట్టిన బ్రహ్మరథమే సాక్షి.
వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌ను ఆవిష్కరించిన జగన్ మైలురాయికి గుర్తుగా ఒక కొబ్బరిమొక్కను నాటారు. జగన్ కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ యాత్రలు జరిగాయి.