Begin typing your search above and press return to search.
జగన్ తాజా హామీతో బాబు బేజారే..!
By: Tupaki Desk | 22 Nov 2017 4:48 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుండెలు అదిరిపోయేలా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ హామీ ఇచ్చారు. ఏపీ రాజకీయం మొత్తంగా మారేలా ఇచ్చిన ఈ హామీ రానున్న రోజుల్లో గేమ్ ఛేంజర్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రలో ఇప్పటికే పలు ఆసక్తికర హామీలు ఇచ్చిన జగన్.. తన పద్నాలుగో రోజులో ఇచ్చిన హామీ భవిష్యత్ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పక తప్పదు.
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని బేతంచర్లలో నిర్వహించిన పాదయాత్రలో జగన్ ఇచ్చిన తాజా హమీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ జగన్ ఇచ్చిన హామీ ఏమిటంటే.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి వ్యాధికైనా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయించి.. రోగిని చిరునవ్వుతో ఇంటికి పంపుతామన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు సర్కారు నీరుకార్చిందని ధ్వజమెత్తిన జగన్.. తాము పవర్లోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీ వ్యవస్థను మెరుగుపర్చుస్తామన్నారు.
క్యాన్సర్.. కిడ్నీ మార్పిడి.. మోకాళ్ల శస్త్రచికిత్సలు.. బధిరులైన పిల్లలకు ఫ్రీగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న చంద్రబాబు పాలనకు చరమగీతం పాడే రోజులు వచ్చాయన్నారు. రామాయణం.. మహా భారతం.. ఖురాన్ లలో నిజాయితీనే గెలిచిందని గుర్తు చేసిన జగన్.. భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయటమే తన థ్యేయంగా చెప్పుకున్నారు.
దివంగత మహానేత వైఎస్ పాలనలో ఎవరికైనా ప్రమాదం జరిగి 108 నంబరుకు డయల్ చేస్తే 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చేదని.. అవసరమైతే హైదరాబాద్ కు కూడా తీసుకెళ్లేవారన్నారు. ఆపరేషన్ చేయించి బాధితుడ్ని చిరునవ్వుతో ఇంటికి పంపేవారని.. ఇప్పుడు అదే ప్రజలు కావ్.. కావ్ అంటున్నా అంబులెన్స్ లు రావట్లేదన్నారు.
ఏపీ ప్రజలు హైదరాబాద్ వెళ్లి వైద్యం చేయించుకుంటే బాబు ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఇవ్వనంటున్నారని.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మంచి ఆసుపత్రి ఎక్కడుందని ప్రశ్నించారు.
మంచి ఆసుపత్రులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఎవరికైనా బాగోలేదంటే హైదరాబాద్ లో చికిత్స చేయించక తప్పదని.. కానీ.. అలా చేయించుకుంటే డబ్బులు ఇవ్వమని చెప్పటం దారుణంగా అభివర్ణించారు. మన ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని పూర్తిగా మెరుగుపరుస్తామని.. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి సమయంలో కూడా రోగులకు డబ్బులు ఇస్తామంటూ తన హామీల పర్వాన్ని ఎక్కడికో వెళ్లేలా చేశారు జగన్.
కిడ్నీ రోగులకు రూ.10వేల చొప్పున పింఛను అందజేస్తామన్న ఆయన.. హైదరాబాద్ లో మళ్లీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తామన్నారు. ప్రజల దయతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. తాను చెప్పినవన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ అమలులో దివంగత మహానేత వైఎస్ హయాంలో అమలు జరిగిన తీరును ప్రజలు మర్చిపోలేరు. ప్రస్తుత ప్రభుత్వం ఏ అంశాన్ని అయితే నిర్లక్ష్యం చేశారో.. పెద్దగా పట్టించుకోవటం లేదో సరిగ్గా ఇప్పుడదే అంశాన్ని ప్రస్తావించటం ద్వారా జగన్ తన హామీలతో ఏపీ అధికారపక్షానికి షాకిచ్చేలా చేస్తున్నారు. తాజాగా జగన్ చేసిన హామీలు అమలు ఎలా అన్నది పక్కన పెడితే.. సామాన్యుడి దృష్టిని విపరీతంగా ఆకర్షించటం ఖాయం. ఇంతకాలం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న హామీల పరంపర ఏదీ జగన్ ఇస్తున్న భారీ హామీల ముందు తేలిపోతున్న పరిస్థితి.