Begin typing your search above and press return to search.

అధ్యక్షా.. మైక్ ఆన్ లో ఉందా? లేదా?

By:  Tupaki Desk   |   7 March 2017 7:13 AM GMT
అధ్యక్షా.. మైక్ ఆన్ లో ఉందా? లేదా?
X
ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని వెలగపూడిలో ఏర్పాటు చేసినఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజైనా మంగళవారం నాడు.. సభలో మాట్లాడే సమయంలో మైకులు పని చేస్తున్నాయా? లేదా? అన్నది పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. గతంలో మైకులు ఉండటం.. దాని ద్వారా చెక్ చేసుకునే వీలుంది.

కానీ.. సభలో సభ్యులకు కోపం వచ్చినప్పుడు మైకుల్ని విరిచివేసే పద్దతికి చెక్ చెప్పేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ.. సెన్సర్లతో కూడిన మైకుల్ని ఏర్పాటు చేశారు. ఈ మైకుల కంట్రోల్ మొత్తం స్పీకర్ వద్దనే ఉంటుంది.

దీంతో.. మాట్లాడటం మొదలు పెట్టిన వెంటనే.. మైకు పని చేస్తుందో లేదో అన్నది పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన జగన్.. కొత్త టెక్నాలజీ కారణంగా.. మైకులు పని చేస్తున్నాయో లేదో తమకు అర్థం కావటం లేదని.. మైకుల వైపు చూడాలో.. మీ వైపు చూడాలో మాకు అర్థం కావట్లేదు అధ్యక్షా అంటూ ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించగా.. సభలో నవ్వులు వెల్లి విరిశాయి.

ఎస్సీ.. ఎస్టీ కుటుంబాలకు 50 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారని.. ఈ పథకం కింద ఆయా వర్గాలకు ముష్టి వేసినట్లుగా ఇస్తున్నారని.. చేస్తున్న తక్కువ సాయానికి అదేదో గొప్పగా చేసినట్లుగా చెప్పుకోవటం సరికాదన్నారు. నిరుపేద వర్గాలకు ఇచ్చేది చిన్న మొత్తమే అయినా.. అదేదో చాలా గొప్పగా చేసినట్లుగా చెప్పుకుంటున్న మంత్రి వైఖరిని తప్పు పట్టారు.

గతంలో నెలకు బిల్లురూ.150 వస్తే.. ఇప్పుడు రూ.500 చొప్పున బిల్లు వస్తుందన్నారు. దీంతో.. ఎస్సీ.. ఎస్టీ వర్గాలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితిపై నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/