Begin typing your search above and press return to search.
హోదా బంద్ పై జగన్ ట్వీట్.. డిఫెన్స్ లో బాబు
By: Tupaki Desk | 24 July 2018 4:31 AM GMTఏపీకి ప్రత్యేక హోదా సాధనకు దేనికైనా రెఢీ అన్నట్లుగా మాటలు చెబుతున్న ఏపీ అధికారపక్షం.. చేతల విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించటం కనిపిస్తోంది.ప్రత్యేక హోదా సాధన కోసం అవిశ్వాస తీర్మానం పెట్టటమే కాదు.. గతంలో తాను వినిపించిన మాటలకు భిన్నంగా హోదాతో ఏపీకి ఎంత లాభమన్న విషయాన్ని వెల్లడించి.. తన పాత తప్పుల్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
హోదాపై తమకున్న కమిట్ మెంట్ ను ప్రదర్శించేందుకు బోలెడన్ని మాటలు చెప్పిన ఏపీ అధికారపక్షం తాజాగా అడ్డంగా బుక్ అయ్యింది. హోదా కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించిన బాబు సర్కారు.. తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పిలుపునిచ్చిన ఏపీ బంద్ ను అడ్డుకునేలా చర్యలకు దిగటం ఇబ్బందికరంగా మారింది.
హోదా మీద తెలుగు తమ్ముళ్లకు కమిట్ మెంట్ ఉంటే.. జగన్ బంద్ పిలుపునకు స్పందించి.. టీడీపీ సైతం స్వాగతించేలా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ లేకపోవటం బాబు మెడకు చుట్టుకునేలా ఉందని చెబుతున్నారు. ఓపక్క హోదా కోసం భారీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్న చంద్రబాబు.. అందుకు తగ్గట్లే జగన్ బంద్ పిలుపును ఇచ్చినప్పుడు వెంటనే ఒప్పేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హోదా కోసం పోరాడుతున్న రాజకీయ పార్టీగా తమకున్న మైలేజీని దెబ్బ తీసేలా జగన్ బంద్ పిలుపు ఉందని చెబుతున్నారు. దీన్ని నిజం చేస్తున్నట్లుగా ఏపీ సర్కారు దుందుడుకుగా వ్యవహరిస్తోంది. బంద్ ను అడ్డుకునేలా చేయటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పిలుపునిచ్చిన బంద్ కు అన్ని వర్గాలు తమ సంపూర్ణ మద్దతును తెలిపాయి.
ఇదిలా ఉంటే బంద్ విఫలం కావటానికి వీలుగా బాబు సర్కారు.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల్ని ముందస్తుగా గృహనిర్భందంలోకి తీసుకుంది.ఈ చర్యపై జగన్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజా పరిణామాలపై విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఓపక్క హోదా సాధన కోసం కేంద్రంతో కోట్లాటకు రెఢీ అంటూనే.. అందుకు తమ వంతు సాయంగా నిరసనను చేపట్టిన జగన్ పార్టీ బంద్ ఫెయిల్ అయ్యేలా చేయటంలో అర్థం లేదంటున్నారు. హోదా సాధనకు బాబు సర్కారుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. బంద్ కు మద్దతు ఇవ్వాలని.. జగన్ పార్టీ నేతల్ని గృహ నిర్బంధం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెబుతున్నారు. హోదా సాధన కంటే రాజకీయ ప్రాధాన్యత ముఖ్యమని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తీరుతో భారీ నష్టం వాటిల్లుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.