Begin typing your search above and press return to search.
షాతో జరిగిన అరగంట భేటీలో జగన్ ఏమేం అడిగారు?
By: Tupaki Desk | 15 Feb 2020 7:53 AM GMTప్రధాని మోడీతో భేటీ అనంతరం.. ఆయన సూచన మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిశారు. ప్రధాని చెప్పిన రోజు అమిత్ షా బిజీగా ఉండటంతో తిరిగి వచ్చిన జగన్.. శుక్రవారం సాయంత్రం వేళకు ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి 9.45 గంటల వేళలో షాతో భేటీ అయ్యారు.
తన వెంట పలువురు ఎంపీలతో ఢిల్లీకి చేరిన జగన్.. అమిత్ షాతో నలభై నిమిషాల పాటు గడిపితే.. దాదాపు వారి మధ్య అరగంట పాటు వివిధ అంశాలపై చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా తన రిక్వెస్ట్ చిట్టాను షా ముందు ఉంచారు జగన్. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వెనుక అసలు విషయాల్ని షాకు వివరించినట్లుగా చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు.. మూడు రాజధానులు.. మండలి రద్దు నిర్ణయం.. దిశ చట్టం.. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తరలింపు తదితర అంశాల్ని అమిత్ షాకు వివరించారు. తాము చేపట్టిన రివర్స్ టెండరింగ్ కారణంగా నిధుల్ని ఆదా చేస్తున్న వైనాన్ని హైలెట్ చేసినట్లుగా చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తంలో కేంద్రం నుంచి రూ.3320 కోట్లు రావాల్సి ఉందన్న మాటతో పాటు 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు.
రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.838 కోట్లు ఆదా చేసినట్లుగా జగన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు.. గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చిందని.. గత ప్రభుత్వ హయాంలో ఒక ఏడాదిలో విడుదల చేసిన రూ.22వేల కోట్లలో ఇది సగమే అన్న విషయాన్ని షాకు వివరించారు. పెండింగ్ లో ఉన్న గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. వెనుక బడిన జిల్లాలకు ఇచ్చే నిధులను మూడేళ్లుగా ఇవ్వటం లేదన్నారు.
ఏపీలో వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్.. కలహండి తరహా లో ఇవ్వాలన్నారు. ఏపీ రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని విభజన చట్టంలో చెప్పారని.. 2014-15కు సంబంధించి ఏపీకి రావాల్సిన రూ.18,9969 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అదే సమయం లో ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ప్రకటించాలన్న మాట జగన్ నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు.
తమ రాష్ట్రం మంచి ఉద్దేశం తో తీసుకొచ్చి దిశ చట్టాన్ని కేంద్రం ఓకే చెప్పాలన్నారు. రాజకీయ కారణాలతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని మండలితో మోకాలు అడ్డుతున్నారని.. ఈ క్రమంలో మండలిని రద్దు చేయాలన్న నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేయాలని కోరారు. మొత్తంగా తనకు లభించిన తక్కువ సమయాన్ని రాష్ట్రానికి సంబంధించిన అంశాల్ని జగన్ ఏకరువు పెట్టారు.ఎప్పటిలానే సీఎం చెప్పిన మాటల్ని అమిత్ షా శ్రద్ధ గా విన్నారు. అన్నింటికి చేస్తాం.. చూస్తామన్న మాటే వచ్చినట్లుగా తెలుస్తోంది.