Begin typing your search above and press return to search.
జగన్ రోడ్ షోలో 108 వచ్చినప్పుడు ఏం జరిగింది?
By: Tupaki Desk | 8 Oct 2018 5:30 AM GMTరాజకీయాల్లో కుయుక్తులు సహజం. తమ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నోళ్లు చెబుతున్న మాటలు తప్పన్నట్లుగా చిత్రీకరించటం మామూలే. తాజాగా అలాంటి పనే బాబు ప్రభుత్వం చేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటలకు తగ్గట్లే తాజాగా చోటు చేసుకున్న పరిణామంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ జరిగిందేమిటి? అన్నది చూస్తే..
ఆదివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్తలో భారీ బహిరంగ సభ జరిగింది. కనుచూపు మేర జన సందోహంతో పరిసరాలు నిండిపోయాయి. జగన్ ప్రసంగం సాగుతూ.. బాబు సర్కారు అనుసరిస్తున్న తప్పుడు విధానాల్ని ఎత్తి చూపిస్తున్నారు. 108 అంబులెన్స్ ల దుస్థితిపై జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న వేళ.. అక్కడకు 108 వాహనం రావటం ఆసక్తికరంగా మారింది.
ఈ మధ్యన జరిగిన జగన్ సభలో ప్రసవం కోసం వెళుతున్న ఒక మహిళ ప్రయాణిస్తున్న ఆటో రావటం.. దాన్ని గుర్తించిన జగన్.. ఆటో వెళ్లేందుకు దారి ఇవ్వాలని రిక్వెస్ట్ చేయటం తెలిసిందే. ఇదే రీతిలో 108 అంబులెన్స్ కు దారి ఇవ్వాలని జగన్ కోరటం.. వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు.. కార్యకర్తలు.. అంతటి భారీ జన సందోహంలోనూ అంబులెన్స్ కు దారి ఇవ్వటం కనిపించింది.
ఇదిలా ఉంటే..ఈ వ్యవహారంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క వీధిలో నుంచి 108 అంబులెన్స్ వెళ్లే వీలున్నా.. అలా కాకుండా.. సభ వైపు రావటం వెనుక అధికారపక్షం కుట్ర ఉందన్నారు. అయినా.. వారి నికృష్ట ఆలోచల్ని వదిలేద్దాం.. మనం మాత్రం మంచిగానే వ్యవహరిద్దాం.. అంబులెన్స్ లకు దారి ఇద్దామని రిక్వెస్ట్ చేసి.. అంబులెన్స్ కు దారి ఇచ్చే వరకూ.. దానికి దారి ఇవ్వాలని చెబుతూ.. ట్రాఫిక్ క్లియర్ చేశారు.
రాజకీయాల సంగతి ఎలా ఉన్నా.. మానవత్వంతో జగన్ వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఓపక్క ప్రాణం మీదకు వచ్చి 108 అంబులెన్స్ ల కోసం ఫోన్ చేస్తే.. ఏదో కారణం చెప్పి రాలేకపోతుందన్న మాట పలువురి నోట వినిపిస్తుంటే.. జగన్ సభల వద్దకు 108 వాహనాలు రావటం ద్వారా.. ప్రభుత్వం 108 అంబులెన్స్ వ్యవస్థను బ్రహ్మండంగా నడుపుతుందన్న సంకేతాలు ఇవ్వటం కోసమే కొందరు నేతలు పని కట్టుకొని ఇలా చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాజకీయాల మాట ఎలా ఉన్నా.. అత్యవసర సేవల కోసం అంబులెన్స్ లో వెళుతున్న వారి విషయంలో జగన్ అనుసరించిన తీరును పలువురు ప్రశంచిస్తున్నారు.