Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ నోటి మాటకు వేలాదిమంది రియాక్ష‌న్

By:  Tupaki Desk   |   4 Oct 2018 6:09 AM GMT
జ‌గ‌న్ నోటి మాటకు వేలాదిమంది రియాక్ష‌న్
X
వేలాదిగా జ‌నం. ఇసుక వేస్తే రాల‌న్న‌ట్లుగా కిక్కిరిసి ఉన్న ప్ర‌జానీకం చుట్టూ ఉన్న‌ప్పుడు ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మేలేదు. అలాంటి ప‌రిస్థితుల్లో.. జ‌గ‌న్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌కు జ‌నాలు స్పందించిన తీరు.. రియాక్ట్ అయిన ప‌ద్ద‌తి ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కంటే కూడా ప్ర‌జ‌ల ఇబ్బందుల విష‌యంలో జ‌గ‌న్ ఎంత అప్ర‌మ‌త్తంగా ఉంటార‌న్న విష‌యం తాజాగా రుజువైంది.

ప్ర‌సంగం జోరుగా సాగుతున్న వేళ‌.. చుట్టూ ఏం జ‌రుగుతుందో ప‌ట్టించుకోని అధినేత‌లు ఎంద‌రో.కానీ.. అందుకు భిన్నంగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుకు మ‌న‌సున్న మారాజు అంటూ కీర్తిస్తున్న ప‌రిస్థితి. వైర‌ల్ గా మారిన వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఈ వైర‌ల్ వీడియోలో ఏముంద‌న్న‌ది చూస్తే..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో భాగంగా బుధ‌వారం నెల్లిమ‌ర్ల‌లోని మొయిద జంక్ష‌న్ లో భారీ బ‌హిరంగ స‌భ సాగుతోంది. అడుగు తీసి అడుగు వేయ‌టం క‌ష్టంగా మారింది. ఇసుక వేస్తే రాల‌నట్లుగా జ‌నంతో రోడ్లు మొత్తం నిండిపోయాయి.

ఇలాంటివేళ‌లో చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం గుర్ల మండ‌లం ఆనంద‌పురం గ్రామానికి చెందిన రాజేశ్వ‌రి అనే గ‌ర్భిణి ఆటోలో ఆ దారి గుండా ఆసుప‌త్రికి వెళుతున్నారు. జ‌నం మ‌ధ్య‌లో నుంచి ఆటో వెళ్ల‌లేక‌పోవ‌టాన్ని వేదిక మీద నుంచి గుర్తించారు జ‌గ‌న్‌. వెంట‌నే తన ప్ర‌సంగాన్ని ఆపేశారు జ‌గ‌న్‌. నిండు గ‌ర్భిణి వైద్యం కోసం ఆసుప‌త్రికి వెళుతుంద‌న్న విష‌యాన్ని గుర్తించి చ‌లించిన ఆయ‌న‌.. అన్నా.. ఆటోకు దారివ్వండ‌న్నా.. 108 రాక ఆ గ‌ర్భిణి ఆటోలో వెళుతోంది.. కొంచెం స్థ‌లం ఇవ్వాలి.. కొంచెం ముందుకు వెళ్లేలా స్థ‌లం ఇవ్వాల‌ని కోరుతున్నా.. అంటూ ప‌దే ప‌దే విన్న‌వించారు. అంతే.. వేలాది మందిలో ఒక్క క‌ద‌లిక‌.. ఆటో వెళ్లేందుకు వీలుగా..జ‌నం రెండు విడిపోయి.. ఆటో వెళ్లేందుకు దారి ఇచ్చారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. మ‌న‌సున్న మారాజుగా.. క‌ష్టంలో ఉన్న సామాన్యుల్ని గుర్తించి.. వారికి త‌న వంతుగా స్పందించిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మ‌న‌సున్న మారాజుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో పాటు.. జ‌గ‌న్ మాట‌కు జ‌నం స్పందించిన తీరును ప్ర‌త్యేకంగా చెప్పుకుంటున్నారు. జ‌గ‌న్ మాట‌కు జ‌నం క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన సైనికులుగా స్పందించిన తీరు అంద‌రి అభినంద‌న‌లు అందుకుంటోంది.

ఇదిలా ఉంటే.. 108కి ఫోన్ కొడితే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్.. ఇప్పుడు విన‌ప‌డ‌టం లేద‌ని.. రాష్ట్రంలో పాల‌న ఎంత దారుణంగా ఉందో దీనికి ఉదాహ‌ర‌ణ అని చెప్పారు. జ‌గ‌న్ స‌భ నేప‌థ్యంలో గ‌ర్భిణి ఉన్న ఆటో ముందుకు వెళ్ల‌గ‌ల‌దా? అన్న అనుమానంతో ఉన్న వారికి.. నేరుగా జ‌గ‌నే సాయం చేసిన వైనంతో వారి కుటుంబం జ‌గ‌న్ కు అభివాదం చేసి ముందుకు వెళ్లారు.