Begin typing your search above and press return to search.
రాజకీయ నాయకులకు బిగ్ షాక్..నేరం రుజువైతే పదవి పోయినట్టే!
By: Tupaki Desk | 22 Feb 2020 12:30 AM GMTరాజకీయం .. ప్రస్తుతం అంగబలం , ఆర్థికబలం , మందిబలం ఉన్నవారి ఇళ్ల చుట్టూనే తిరుగుతోంది. ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చుపెడతా అంటే వారికే పార్టీ టికెట్ , ఈ క్రమంలోనే ఎన్ని నేరాలు చేసినా కూడా రాజకీయంగా వచ్చే పదవుల్ని అడ్డు పెట్టుకొని కొందరు మరిన్ని ఘోరాలకి పాల్పడుతున్నారు. కానీ , దీనిపై తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేబినెట్ లో ఆమోదించిన మేరకు పంచాయతీ రాజ్ చట్టానికి అనేక సవరణలు చేసి , కొత్త ఆర్డినెన్స్ లో పొందుపరిచారు. అనంతరం వాటన్నిటినీ ఉత్తర్వుల రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ మేరకు శుక్రవారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమ మార్గాల ద్వారా గెలిచినా.. తప్పు నిరూపణ అయి శిక్ష పడితే పదవిని వదులుకోక తప్పదు అని, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆర్డినెన్స్ చేశారు. తాజాగా తీసుకొచ్చిన సవరణల ప్రకారం.. క్రిమినల్ కేసులున్న వ్యక్తులు, రాజ్యాంగ బద్దంగా ఏదైనా పదవులకి ఎన్నికైనా కూడా ఆ పదవి నుంచి తొలగిస్తారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు మూడేళ్లు వరకు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించనున్నారు.
అలాగే గ్రామ పంచాయతీ సక్రమంగా పనిచేయడానికి జిల్లా కలెక్టర్ లేదా కమిషనర్ లేదా ప్రభుత్వ ఉత్తర్వులను ఉపేక్షించినప్పుడు, లేదా అమలు చేసేందుకు నిరాకరించినప్పుడు, తన హోదాను అధికారాలను దుర్వినియోగం చేసినప్పుడు.. లేదా తన కర్తవ్యాలను నిర్వర్తించడం లో విఫలమైనప్పుడు.. గ్రామ పంచాయతీ నిధుల స్వాహా చేసినప్పుడు.. గ్రామ పంచాయతీ కార్యకలాపాలకు విఘాతం కలిగించినప్పుడు.. సర్పంచ్ లేదా ఉపసర్పంచ్ ను కలెక్టర్ తొలగించవచ్చు అని తెలిపారు. సస్పెన్షన్ కు గురైన సర్పంచ్.. తొలగించిన తేదీ నుంచి ఆరేళ్లపాటు వార్డు సభ్యుడిగా గానీ, సర్పంచ్‌గా గానీ తిరిగి పోటీ చేయడానికి అర్హత కోల్పోతారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలు 13 రోజుల్లో.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 15 రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది.