Begin typing your search above and press return to search.

దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇదీ చంద్రబాబు..

By:  Tupaki Desk   |   13 Jun 2019 6:37 AM GMT
దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇదీ చంద్రబాబు..
X
అసెంబ్లీలో సీఎం హోదాలో జగన్ తొలి ప్రసంగం చేశారు. తొలి పలుకునుంచే ప్రతిపక్ష చంద్రబాబును టార్గెట్ చేశారు. ఇక ప్రతిపక్షంపై యుద్ధమేనని ప్రకటించారు. జగన్ ఇలా తొలి ప్రసంగంలోనే ఎదురుదాడికి దిగుతాడని ఎవ్వరూ ఊహించలేదు. దీంతో అవాక్కవ్వడం చంద్రబాబు వంతైంది. జగన్ మాటలకు చంద్రబాబు చాలా సీరియస్ గా పక్కనే ఉన్న అచ్చెన్నాయుడితో చర్చించడం కనిపించింది..

జగన్ స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేని సీతారాంను అభినందిస్తూ చంద్రబాబు గత పాలనను ఏకిపారేశాడు. గత అసెంబ్లీలో విలువలూ, అసెంబ్లీ నిబంధనలు పాటించలేదని.. ప్రతిపక్షానికి మైక్ కూడా ఇవ్వకుండా వారి గొంతునొక్కేశారని.. మీరు అలా చేయవద్దని సూచించారు.

*బాబుకు ప్రతిపక్ష హోదా.. నాకు బాబుకు తేడా అదే..
చంద్రబాబుకు వచ్చిన 23 ఎమ్మెల్యేల నుంచి ఐదుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా ఉండదని.. అలా చేద్దామా అని కొందరు వైసీపీ మంత్రులు తనతో అన్నారని..కానీ విలువలకు కట్టుబడ్డ నేతగా.. తాను అలా చేయనని ఖరాఖండీగా చెప్పానని జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అలా చేస్తే నాకు.. చంద్రబాబుకు తేడా ఏంటని చెప్పుకొచ్చారు..

*దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇదీ చంద్రబాబు..
చంద్రబాబు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న తమ 23 మంది ఎమ్మెల్యేలను లాగేసి టీడీపీ కండువా కప్పి నలుగురి మంత్రులుగా చేశారని.. ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన వారిని అధికారపక్షంలో కూర్చుండబెట్టడం ఎంతో కలిచివేసిందన్నారు. ఇప్పుడు ఆయనకు అదే 23మంది ఎమ్మెల్యేలు మిగిలారని.. ముగ్గురు ఎంపీలను ఫిరాయిస్తే ముగ్గురు ఎంపీలనే గెలిపించాడని.. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చంద్రబాబు తీరును జగన్ ఎండగట్టారు.

*టీడీపీ ఎమ్మెల్యేలను లాగితే అనర్హత వేటు వేయండి..
చంద్రబాబు లా తాను ప్రతిపక్ష గొంతు నొక్కనని.. వారి ఎమ్మెల్యేలను ఒకవేళ మా పార్టీలో చేర్చుకుంటే రాజీనామా చేసే రమ్మంటానని.. అలా రాకపోతే మీరే అనర్హత వేటు వేయండని జగన్ ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేనిని కోరారు.

ఇలా జగన్ తొలి ప్రసంగంలోనే చంద్రబాబు దిమ్మదిరిగే ఆయన ఫిరాయింపులను, ప్రతిపక్షంపై గతంలో చేసిన దాడులు, గొంతు నొక్కేయడాన్ని ప్రస్తావించి చంద్రబాబు షాక్ ఇచ్చారు. విలువలు, సంప్రదాయాలతో సభ నడిపి ఏపీ గౌరవాన్ని నిలబెడుతానని.. చంద్రబాబులా అనైతికంగా వ్యవహరించనని హామీ ఇచ్చారు.