Begin typing your search above and press return to search.
ఏపీ అన్నదాతలకు ‘రూపాయి’తో జగన్ సర్కార్ సరికొత్త ధీమా
By: Tupaki Desk | 27 Jun 2020 4:45 AM GMTసంక్షేమ కార్యక్రమాల కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టటం అందరూ చేసేదే. మిగిలిన వారికి భిన్నంగా తెలివిగా తీసుకునే నిర్ణయాలు లక్షలాది మందికి కొత్త భరోసాను ఇస్తుంటాయి. తాజాగా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా.. వాటిని పట్టించుకోకున్నా.. సంక్షేమం విషయంలో ఎవరూ ఎలాంటి వేదనకు గురి కావొద్దన్న ఆలోచనతో ఏపీ సర్కారు తెర మీదకు తీసుకొచ్చిన సరికొత్త పథకం.. లక్షలాది రైతన్నలకు కొత్త ధీమాను తెచ్చి పెడుతుందనటంలో సందేహం లేదు.
ఇప్పటివరకూ పంటల బీమా ప్రీమియం కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైతులు సైతం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో.. కొందరు కట్టి..కట్టక దాని ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో పొందే పరిస్థితి లేదు. ఇలాంటి వేళ.. బీమా ప్రీమియం చెల్లింపు విధానాన్ని పూర్తిగా మార్చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాజాగా తీసుకొచ్చిన కొత్త విధానంలో ఏపీలోని అన్నదాతలు ఎవరైనా సరే.. కేవలంరూపాయి మాత్రమే చెల్లిస్తే బీమా ధీమా వారికి సొంతమవుతుంది.
తమ వాటాగా చెల్లించాల్సిన రూపాయి మొత్తాన్ని గ్రామ సచివాలయాల్లో చెల్లించాల్సి ఉంటుంది. రైతు రూపాయి కట్టినంతనే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే కట్టేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంలో రైతు మీద అదనపు భారం పడదు. అదే సమయంలో పూర్తి బీమా రక్ష కూడా లభిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులుకట్టాల్సిన బీమా సరిగా కట్టని కారణంగా చాలా మందిని బీమా మొత్తాలు రాని పరిస్థితి.
అంతేకాదు.. 2018-19 రబీ పంట బీమా ప్రీమియం కింద చెల్లించాల్సిన రూ.122.61కోట్లను తాజాగాజగన్ ప్రభుత్వం చెల్లించింది. దీంతో.. బీమా కంపెనీలు రూ.596.36 కోట్ల మొత్తాన్ని రైతులకు ఇచ్చింది. ఒక్కరూపాయి పథకం రైతులకు కొత్త ధీమాను ఇవ్వటమే కాదు..బకాయిల చెల్లింపు పుణ్యమా అని.. పలువురు రైతులకు బీమా పరిహారం కింద లక్ష రూపాయిలు.. లక్షన్నరరూపాయిలు రావటం గమనార్హం. ఇక.. రావు అనుకున్న పరిహారం మొత్తం ఇంత భారీగా వస్తే.. ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాన్ని ఏ రైతన్న మాత్రం మర్చిపోగలరు?