Begin typing your search above and press return to search.
జగనన్న మరో వరం.. బడికి వెళ్లే అమ్మాయిలకు బ్రాండెడ్ రక్ష
By: Tupaki Desk | 6 March 2021 8:30 AM GMTపాలన తీరు మారింది. గతంలో పాలకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు చేయటానికే కిందా మీదా పడేవారు. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలే కాదు.. ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సంక్షేమానికి పెద్ద పీట వేయటం.. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించటం ఈ మధ్యన ఒక ట్రెండ్ గా మారింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నారు.
ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్న ఆయన.. తాజాగా ఏ వర్గానికి ఆ వర్గానికి సంబంధించి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవే కాకుండా.. గత ప్రభుత్వాలు విస్మరించిన కొన్ని ముఖ్యమైన అంశాలకు అమిత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు ప్రతి నెల వచ్చే నెలసరి ఇబ్బంది వేళలో.. వారికి అవసరమైన శానిటరీ నేప్ కిన్స్ ను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు కాకుండా.. బ్రాండెడ్ శానిటరీ నేప్ కిన్స్ అందజేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సోమవారం (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కొత్త పథకాన్ని షురూ చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది జులై నుంచి ప్రతి నెల ఒకటో తేదీన స్కూల్లో చదివే బాలికలకు బ్రాండెడ్ శానిటరీ నేప్ కిన్స్ ను ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. ఇంతకాలం పాలకులకు పట్టని ఈ తరహా సంక్షేమాన్ని జగన్ గుర్తించి.. దానికి పెద్ద పీట వేయటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.