Begin typing your search above and press return to search.
పీపీఏల పై జగన్ నిర్ణయం.. ఎవరికి లాభం.?
By: Tupaki Desk | 15 July 2019 12:27 PM GMTఇప్పుడు దేశమంతా చాలా చీప్ గా విద్యుత్ దొరుకుతోంది. ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లింక్ ను ఏర్పాటు చేసింది. అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అయినా అన్ని రాష్ట్రాలు కొని వాడుకోవచ్చు. అదీ అతి తక్కువ ధరకే. దాదాపు యూనిట్ కు రూ.3 లకే విద్యుత్ ను కేంద్రం అందిస్తోంది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2014లో ఏర్పడ్డాక విద్యుత్ సంస్కరణలు ఫలితాలను ఇచ్చాయి. ఉత్తర భారత్ గ్రిడ్ ను, దక్షిణ భారత గ్రిడ్ ను అనుసంధానం చేశారు. అప్పటివరకు ఉత్తర భారతంలో విద్యుత్ మిగిలిపోయేది. దక్షిణ భారత్ లోని తెలంగాణ, ఏపీ సహా తమిళనాడులో విద్యుత్ కొరతతో చిమ్మి చీకట్లు అలుముకునేవి. తెలంగాణలో అయితే కొత్త గా ఏర్పడ్డప్పుడు కేసీఆర్ ఎదుర్కొన్న విద్యుత్ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
కానీ ఎప్పుడైతే ఉత్తర భారత లింక్ ను తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి వద్దకు కనెక్ట్ చేశారు. ఇక ఒడిషా, చత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణ, ఏపీకి కనెక్టెవిటీని కల్పించారు. దీంతో దేశమంతా ఉత్పత్తి అయిన విద్యుత్ అన్ని రాష్ట్రాలకు చీప్ గా దొరుకే అవకాశం లభించింది.. విద్యుత్ పూర్తి స్థాయిలో చీప్ గా అందరికీ అందుతోంది.
అయితే చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఇవే ఆరోపనలు చేశారు. దేశంలో యూనిట్ రూ.3కే విద్యుత్ దొరుకుతుండగా.. చంద్రబాబు సర్కారు మాత్రం.. పవన్, సౌర విద్యుత్ ను యూనిట్ కు రూ.6వరకు వెచ్చించడం పెద్ద కుంభకోణంగా జగన్ ఆరోపించారు. గద్దెనెక్కగానే ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల రద్దుకు నిర్ణయించారు.
అయితే కేంద్రం, టీడీపీ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కేంద్ర ఇంధన అధికారులు లేఖలు కూడా రాశారు. పీపీఏలు రద్దు చేస్తే ఏపీకి పెట్టుబడులు రావని.. అభివృద్ధిలో వెనుకబడుతుందని ఆరోపించారు.
అయితే తాజాగా ఏపీ సీఎస్ గా చేసి రిటైర్ అయిన ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం చంద్రబాబు విద్యుత్ కొనుగోళ్లపై సంచలన విషయాలు వెల్లడించారు. పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనివెనుక పెద్ద లాబీయింగ్ ఉందని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో సరిపోయేంత విద్యుత్ ఉత్పత్తి అవుతోందని.. ఈ తరుణంగా జగన్ ప్రైవేటు కంపెనీలతో పీపీఏలు రద్దు చేయడం మంచి నిర్ణయమే అన్నారు. పవన, సోలార్ విద్యుత్ ధరలను భారీగా పెంచి చంద్రబాబు ప్రభుత్వ ఖజానాను ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టారని ఆధారాలు చూపించారు. ఏపీలో సరిపోయేంత విద్యుత్ ఉత్పత్తి సాగుతోందని.. యూనిట్ 3కే వస్తోందని.. అందుకే బాబు చేసుకున్న రూ.6 యూనిట్ రద్దు వల్ల ఏపీ ఖజానాకు తీవ్రనష్టం వాటిల్లుతోందని చెప్పుకొచ్చారు. పీపీఏలతో పెట్టుబడులు రావన్నది ఆయా కంపెనీలు, టీడీపీలు చేస్తున్న తప్పుడు ప్రచారం అన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పీపీఏల రద్దు వల్ల ఏపీకి మేలు జరుగుతుందని ఆయన వివరించారు.