Begin typing your search above and press return to search.
జగన్ కఠిన నిర్ణయం.. సచివాలయానికి బంద్
By: Tupaki Desk | 9 July 2019 8:53 AM GMTవైఎస్ జగన్ తన పాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తానని చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నారు. తాజాగా ఆయన సచివాలయానికి వెళ్లకూడదని నిర్ణయం తీసుకోవడం ఏపీ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు మాత్రం ఆశానిపాతమైంది.
ఏపీ సీఎం జగన్ గద్దెనెక్కగానే జూన్ 8న తొలిసారి ఏపీ సీఎం హోదాలో సెక్రెటేరియట్ కు వచ్చారు. కేబినెట్ భేటిని నిర్వహించారు. ఆ తరువాత వరుసగా సమీక్షలు చేస్తూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.
అయితే తాజాగా ఏపీలో ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని జగన్ ఎత్తివేసి ఏపీ ఉద్యోగులకు గొప్ప ఊరటనిచ్చారు. దీంతో చాలా ఏళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులందరూ సచివాలయానికి పోటెత్తుతున్నారు. చాలా మంది సిఫారసుల లేఖలతో జగన్ వద్దకు రావడంతో ఆయన పాలనపై, అధికారులపై దృష్టి సారించడం లేదు.
దీంతోనే ఆగస్టు 1 వరకు సచివాలయానికి రావద్దని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అప్పటివరకు జగన్ నివాసమైన సీఎం క్యాంప్ కార్యాలయం నుంచే సమీక్షలు ఇతర ముఖ్యమైన సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నారట..