Begin typing your search above and press return to search.

జగన్ మాదిరి ఒక్కసారైనా సొంత డబ్బుల్ని తీశారా బాబు?

By:  Tupaki Desk   |   16 Aug 2019 1:15 PM IST
జగన్ మాదిరి ఒక్కసారైనా సొంత డబ్బుల్ని తీశారా బాబు?
X
వారం రోజుల అమెరికా ట్రిప్ కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారన్నది పాత వార్తే. ఆయన షెడ్యూల్ ఏమిటి? ఎప్పుడు ఎక్కడ ఉంటారు? ఎవరిని కలుస్తారు? ఏయే సమావేశాల్లో పాల్గొంటారు? లాంటి అన్ని వివరాల్ని ఇప్పటికే ఏపీ సీఎంవో వెల్లడించింది. ఇదేమీ కొత్త విషయం కాదు. ప్రధాన మీడియా నుంచి మామూలు మీడియాతో పాటు.. సోషల్ మీడియా కూడా పెద్దగా పట్టించుకోని విషయం ఒకటి ఉంది.

అదేమంటే.. ఇటీవల కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనిని జగన్ చేశారు. తాజాగా జగన్ వెళ్లిన అమెరికా ట్రిప్ సొంత ఖర్చులతో వెళ్లటం గమనార్హం. వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న జగన్.. నాలుగు రోజులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండగా.. మరో మూడు రోజులు మాత్రం వ్యక్తిగత పనులకు తన సమయాన్ని కేటాయించనున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికా ట్రిప్ ఖర్చులకు సొంత డబ్బును ఖర్చు చేయాలని నిర్ణయించారు. జగన్ ముందు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు.. గతంలో తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా వ్యవహరించారు. తన రాజకీయ కెరీర్ లో ఇప్పటివరకూ సీఎం హోదాలో విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారీ ప్రభుత్వఖర్చులతో వెళ్లటమే కానీ సొంత ఖర్చుతో వెళ్లింది లేదు. అందుకు భిన్నంగా జగన్ మాత్రం తన సొంత ఖర్చుతో వెళ్లటం ద్వారా సరికొత్త సంప్రదాయాన్ని తెర మీదకు తెచ్చారని చెప్పాలి. ప్రభుత్వ ఖర్చుతో వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. దానిని ఉపయోగించుకోని తీరు తెలిసిన వారంతా జగన్ నిర్ణయాన్ని అభినందిస్తుండటం గమనార్హం.