Begin typing your search above and press return to search.
మాటలు మీరిన గౌతంపై జగన్ వేటు
By: Tupaki Desk | 4 Sep 2017 4:50 AM GMTపార్టీ ఒకటే అయినా.. వ్యక్తుల మధ్య వ్యక్తిగత వివాదాలు కామన్. పార్టీ తీరుకు భిన్నంగా తప్పులు చేస్తూ.. అనవసర ఉద్రిక్తతలకు కారణమైన నేత వైఖరిని ఖండించటమే కాదు.. వెనువెంటనే నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న వివాదం హద్దులు దాటటమే కాదు.. వంగవీటి మోహన్ రంగా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తీరును జగన్ వెనువెంటనే ఖండించటమే కాదు.. వేటు నిర్ణయాన్ని తీసుకున్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా.. పార్టీలో వారి స్థానం ఏదైనా సరే వెనక్కి తగ్గేది లేదన్న విషయాన్ని జగన్ స్పష్టం చేశారనుకోవాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న గౌతంరెడ్డి ఒక ప్రైవేట్ టీవీ చానల్ లో చేసిన వ్యాఖ్యలు.. విజయవాడ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనేలా చేశాయి. చిలికి చిలికి గాలివానలా మారక ముందే జగన్ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నారు.
వంగవీటి రంగా హత్యపై ఓ ప్రైవేటు ఛానల్ లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగా అనుచరులు.. అభిమానులు గౌతంరెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రంగా హత్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను వివాదానికి కారణంగా మారాయి. ఈ నేపథ్యంలో గౌతం రెడ్డి తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గీత దాటిన వారిపై వేటు వెంటనే పడుతుందన్న సంకేతాన్ని గౌతంరెడ్డి ఎపిసోడ్ లో జగన్ స్పష్టం చేశారని చెప్పక తప్పదు.