Begin typing your search above and press return to search.
గవర్నర్ తో జగన్ మీటింగ్ అజెండా అదే!
By: Tupaki Desk | 16 April 2019 4:17 AM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేడు గవర్నర్ ను కలుస్తున్నారు. పోలింగ్ అనంతరం హింసాకాండల విషయంలో జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్టుగా సమాచారం. ఏపీలోని వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాకాండలు చెలరేగాయి.
పోలింగ్ రోజున కూడా పలు చోట్ల హింసాత్మక కార్యకలాపాలు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు కూడా మరణించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలూ ఇద్దరు మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక అనంతరం కూడా దౌర్జన్య కాండలు తగ్గుముఖం పట్టలేదు.
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్తకు సంబంధించిన మూడు ఎకరాల అరటి పంటకు నిప్పు పెట్టడం సంచలనం రేకెత్తించింది. ఆ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది.
అలాగే పలు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై చిత్రమైన కేసులు నమోదు అయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెల మీద జరిగిన దాడి వ్యవహారంలో..ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతల మీద కూడా కేసులు నమోదు కావడం విశేషం. సత్తెనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అంబటి రాంబాబుతో సహా అనేక మంది నేతలపై కేసులు నమోదయ్యాయి!
ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు చెబుతూ ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారని, ఆ విషయంలో జేసీ అస్మిత్ రెడ్డి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదని.. ఆ పార్టీ ప్రశ్నిస్తోంది.
ఈ పరిణామాలను జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని, తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదనే నెపంతో అనేక మందిపై దాడులు జరిగాయని.. ఈ విషయాలనూ గవర్నర్ కు జగన్ వివరిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.