Begin typing your search above and press return to search.
తెలుగుదేశం పార్టీ కోరిక తీరుస్తున్న జగన్!
By: Tupaki Desk | 18 Jun 2019 6:46 AM GMT'పోలవరాన్ని సందర్శించాలి..' ఇదీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ పదే పదే చేసిన డిమాండ్. అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉండిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆ డిమాండ్ చేశారు. జగన్ పోలవరం వెళ్లాలంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు ఉచిత సలహాలు ఇచ్చారు.
ఇప్పుడు వారి సలహాలనే జగన్ పాటించబోతూ ఉన్నారు. పోలవరం సందర్శనకు డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నెల ఇరవైయవ తేదీన జగన్ మోహన్ రెడ్డి పోలవరం సందర్శనకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ జగన్ ను పోలవరం సందర్శించాలని సూచించగా, ఆయన ఆ పనే చేస్తున్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి హోదాలో పోలవరం సందర్శనకు వెళ్తూ ఉన్నారు! అదే తేడా. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పోలవరాన్ని సందర్శించాలని టీడీపీ కోరితే, ఆయన ముఖ్యమంత్రిగా పోలవరాన్ని సందర్శించబోతూ ఉన్నారు.
అక్కడే పలు అంశాల గురించి సీఎం జగన్ సమీక్షించబోతున్నట్ఉటగా తెలుస్తోంది. పనుల పురోగతి, నిర్వాసితుల పునరావాసం, భూ సేకరణ.. తదితర అంశాల గురించి జగన్ అక్కడిక్కడే సమీక్ష నిర్వహించబోతూ ఉన్నారట.
క్షేత్ర స్థాయిలో పరిశీలనల తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఆ అంశం గురించి విపులంగా మాట్లాడే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి అంచనాల పెంపు విషయంలో జగన్ దృష్టి సారించే అవకాశాలున్నాయి. సమీక్ష అనంతరం అంచనాలను తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.