Begin typing your search above and press return to search.
జీయిర్ స్వామితో జగన్..పాదయాత్ర డేట్ ఫిక్సయింది
By: Tupaki Desk | 3 Oct 2017 2:30 PM GMTఏపీ ప్రతిపక్షనేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు. త్రిదండి చినజీయర్ స్వామిని అనూహ్యంగా - ప్రత్యేకంగా కలుసుకున్నారు. తన ఆప్తుడు...పార్టీ సీనియర్ నేత కూడా అయిన ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని శ్రీరామ నగరాన్ని సందర్శించిన జగన్... ఆశ్రమంలో గంటకు పైగా గడిపారు. జగన్ కు జీయర్ స్వామిజీ మంగళాశాసనాలు అందించారు. త్వరలో పాదయాత్రకు బయల్దేరుతున్న జగన్ చిన్న జీయర్ స్వామిజీని ప్రత్యేకంగా కలవడం ఆసక్తి మారింది. ఈ యాత్ర విజయవంతం కావడం కోసం స్వామిజీ ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు నవంబర్ 2నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బెంగళూరు నుంచి జగన్ వస్తూ శంషాబాద్ లో చినజీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన పాదయాత్ర - ఏపీలో రాజకీయ పరిణామాలు - ప్రస్తుత పరిపాలన వంటి అంశాలపై జీయర్ స్వామీజీకి - జగన్ కు మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే ఈ భేటీపై అధికారిక సమాచారాన్ని వైసీపీ వెల్లడించలేదు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరికీ చేరువ అయ్యేందుకు `అన్న వస్తున్నాడు` పేరుతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత - వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ఆదిలోనే బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలపై ఉద్యమించడం...వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం..., ప్రజలకు చేరువ అవడం....2019 ఎన్నికలకు సమాయత్తం అవడం...అనే బహుళ లక్ష్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆరు నెలల పాటు 3 వేల కిలోమీటర్లు పూర్తయ్యేలా ప్రణాళిక వేసిన ఈ యాత్ర షెడ్యూల్ చేంజ్ అయింది. అక్టోబర్ 27 నుంచి ప్రారంభమవ్వాల్సిన వైఎస్ జగన్ పాదయాత్ర నవంబర్ మొదటి వారానికి వాయిదా పడిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోని విశ్వసనీయవర్గాల సమాచారం. కోర్టు కేసులు, పార్టీ కార్యక్రమాలు ఆలస్యం కావడంతో పాదయాత్రను వాయిదా వేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.