Begin typing your search above and press return to search.
మూడు రోజులు అక్కడే జగన్.. ఏం చేయనున్నారు?
By: Tupaki Desk | 21 Dec 2020 3:30 AM GMTఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రోజులు అక్కడే ఉండనున్నారు. సొంత జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా వైఎస్ జగన్ మూడు రోజులు సెలవు తీసుకోనున్నారు. తన సొంత ఊరు పులివెందులలో జరుపుకోనున్నారు. అదేరోజు వైకుంఠ ఏకాదశి కూడా కలిసి రావడం వల్ల గండి ఆంజనేయ స్వామి వారిని దర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కడప, ఇడుపులపాయ, చక్రాయపేట, పులివెందులల్లో జగన్ పర్యటన సాగనున్నట్లు సమాచారం. మూడు రోజుల జిల్లా పర్యటన సందర్భంగా ఆయన పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని అంటున్నారు.
సీఎం జగన్ ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను తన సొంత ఊరిలో జరుపుకునే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. అందుకే 23వ తేదీన గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో గల తన క్యాంప్ కార్యాలయం నుంచి కడపకు బయలుదేరి వెళ్తారు. కడప విమానాశ్రయంలో దిగిన అనంతరం హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 24వ తేదీన పులివెందులకు వెళ్తారు. 25వ తేదీన పులివెందులలోని చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు.
క్రిస్మస్ రోజు ఉదయం ఇడుపుల పాయలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం కడపకు చేరుకుంటారు. 25వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించాల్సి ఉన్నప్పటకీ అది వాయిదా పడింది. దీంతో ఆయన కడప నుంచి నేరుగా కాకినాడకు బయలు దేరి వెళ్తారు. కాకినాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.. అనంతరం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.