Begin typing your search above and press return to search.
సొంత ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్
By: Tupaki Desk | 24 Jun 2019 2:30 PM GMTఎజెండా క్లియర్ గా ఉన్నవాళ్లు పాలన విషయంలోనూ.. అంశాల విషయంలోనూ ఎంత క్లారిటీతో మాట్లాడతారన్నది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తాజాగా ప్రజావేదికలో కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో మాట్లాడిన జగన్.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యమైంది.. సొంత ఎమ్మెల్యేల విషయంలో జగన్ ఇచ్చిన వార్నింగ్ మామూలుగా లేదన్న మాట వినిపిస్తోంది.
ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే మాట్లాడిన జగన్.. తన ప్రభుత్వంలో అవినీతి అన్నది సహించనని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి జగన్ నిర్వహించిన కలెక్టర్ సదస్సులో ఆయన తమ ప్రభుత్వ ఎజెండాను చాలా క్లియర్ గా తేల్చి చెప్పేశారు. అవినీతిని సహించే ప్రసక్తే లేదన్న ఆయన.. గడిచిన ఏడేళ్లలో జరిగిన అవినీతిని తేల్చాల్సిందిగా ఆదేశించారు.
అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేల అవినీతిపైనా తగ్గేది లేదని.. ఎవరైనా తప్పు చేస్తే.. వారెంతటోళ్లు అయినా సరే వేటు వేయటమేనని.. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం లేదని తేల్చేశారు. అంతేకాదు.. కలెక్టర్ల వద్దకు సిఫార్సు లెటర్లు తీసుకొచ్చే అధికార పక్ష ఎమ్మెల్యేల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని.. తూగా తప్పకుండా రూల్స్ ను బ్రేక్ చేయొద్దాన్నారు.
ఎమ్మెల్యేల పిటిషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సానుకూలంగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాధనాన్ని దోచుకునేలా.. అవినీతికి అస్కారం ఉండేవాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని స్పష్టం చేశారు. సిపార్సులు మినహాయించి.. మిగిలిన అన్ని విషయాల్లోనూ వారిని నమ్మకంలోకి తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఏ విషయాల్లో ఎమ్మెల్యేలను దూరంగా పెట్టాలి? మరే విషయాల్లో దగ్గరకు తీయాలన్న విషయంపై జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నారని చెప్పక తప్పదు.