Begin typing your search above and press return to search.
కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు:జగన్
By: Tupaki Desk | 30 April 2018 7:14 AM GMTపేరును వాడేసుకోవటం.. ఫోటోలు పెట్టి.. పూలదండలు వేసేసి గౌరవం నటించటం.. అధికారాన్ని చేజిక్కించుకోవటం లాంటి ఐడియాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యం. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను అక్రమ రీతిలో గద్దె దింపి.. ఆయన ఉసురు పోసుకున్నట్లుగా విమర్శలు ఎదుర్కొనే చంద్రబాబు.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించే విషయంలో కానీ.. మరేదైనా విషయంలో కానీ సీరియస్ గా పని చేసింది కనిపించదు.
ఎన్టీఆర్ పేరుతో నేటికీ ఓట్లు దండుకునే బాబుకు.. ఆయన పరివారానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా భారీ షాకిచ్చారు ఏపీ విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర చేస్తున్న జగన్.. తాజాగా కృష్ణా జిల్లా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం 1900కిలోమీటర్ల మైలురాయిని దాటిన ఆయన.. ఎన్టీఆర్ పుట్టిన ఊరైన నిమ్మకూరులో ప్రసంగిస్తూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు జిల్లాగా పేరు మారుస్తామన్నారు.
ఇదిలా ఉంటే.. నిమ్మకూరులో పర్యటిస్తున్న జగన్ కు.. అక్కడ జరుగుతున్న అవినీతి.. అక్రమాలు..ఎన్టీఆర్ బంధువులు స్వయంగా చూపించటం గమనార్హం. రూ.8.5లక్షల ఖర్చుతో చెరువును తవ్వుతూ.. అలా తవ్వగా వచ్చిన మట్టిని ట్రాక్టర్ ఒక్కొక్కటి రూ.350 చొప్పున.. లారీ రూ.600 చొప్పున అమ్ముతున్నారని.. అలా అమ్మే వారంతా టీడీపీ నేతలేనని అక్కడి వారు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిమ్మకూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పిన జగన్.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టటం ఆ మహానాయకుడికి ఇచ్చే చక్కని గౌరవంగా చెప్పారు. జగన్ నోటి నుంచి వచ్చిన తాజా హామీ అందరి మనసుల్ని దోచుకోగా.. ఈ ఐడియా తమకెందుకు రాలేదన్న ఆక్రోశాన్ని లోగుట్టుగా టీడీపీ నేతలు వ్యక్తం చేయటం గమనార్హం.