Begin typing your search above and press return to search.
'పీఎం ఆవాస్' అమల్లో ఏపీ భేష్ ..జగన్ కు మోదీ అవార్డు
By: Tupaki Desk | 27 Dec 2020 6:45 AM GMTఏపీలో ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో కూడా సత్తా చూపి భేష్ అనిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకోనున్నారు. ప్రధాని మంత్రి అవాస్ యోజన పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌కు మూడో ర్యాంక్ దక్కింది. దీంతో న్యూ ఇయర్ సందర్భంగా జగన్ ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. వర్చువల్ మీటింగ్ ద్వారా సీఎం జగన్ కు ప్రధాని అవార్డు అందజేయనున్నారు.
ఏపీలో ప్రస్తుతం సీఎం జగన్ లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు కూడా క్షేత్ర స్థాయిలో అమలు అయ్యేలా చూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రధాని మంత్రి అవాస్ యోజన పథకం అమలులో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఇందుకు గాను జనవరి ఒకటిన ప్రధాని మోదీ నుంచి వైఎస్ జగన్ అవార్డు అందుకోనున్నట్లు తెలిసింది.
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కేంద్రం అమలు చేస్తున్న పథకం ఆవాస్ యోజన. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. ఈ పథకం కింద గృహ కొనుగోలుదారులకు గృహ రుణంపై 2.67 లక్షల రూపాయల ప్రయోజనం లభిస్తుంది. ఇది గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి సబ్సిడీ రూపంలో వస్తుంది. మరో వైపు ఏపీ ప్రభుత్వం కూడా పేదలకు ఇంటి పథకం కింద క్రిస్మస్ పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ౩౦ లక్షలకు పైగా ఇంటి పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పేదలకు ఇంటిపట్టాలను పంపిణీ చేస్తున్నారు. అలాగే పట్టాలు పొందిన లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చింది. ప్రభుత్వమే కొందరికి ఇల్లు కట్టించి ఇవ్వనుంది. లేదా ప్రభుత్వం నుంచి లబ్ధిదారులే సొమ్ము అందుకుని ఇల్లు కట్టుకోవచ్చు. లేదా ఇంటికి సంబంధించి అంతా సామాగ్రిని ప్రభుత్వమే ఇస్తుంది. లేబర్ చార్జీలు ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ఇల్లు నిర్మించుకోవచ్చు.