Begin typing your search above and press return to search.

వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఐవైఆర్?

By:  Tupaki Desk   |   27 Jun 2017 3:24 PM GMT
వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఐవైఆర్?
X
ఏపీ మాజీ సీఎస్‌ - బ్రాహ్మ‌ణ సంక్షేమ సంఘం మాజీ చైర్మ‌న్ ఐవైఆర్ కృష్ణారావు 2018లో రాజ్య‌సభ‌కు నామినేట్ అయ్యే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 2018లో ఆయ‌న‌ను వైసీపీ నుంచి రాజ్య‌సభ‌కు నామినేట్ చేస్తాన‌ని వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని సమాచారం.

ఐవైఆర్ ను నామినేట్ చేయాల‌ని వైసీపీలో చాలా మంది సీనియ‌ర్ నేత‌లు జ‌గ‌న్ ను సంప్ర‌దించార‌ని స‌మాచారం. ఐవైఆర్ చేరిక‌తో పార్టీకి ల‌బ్ది చేకూరుతుంద‌ని ఆ నేత‌లు భావిస్తున్నార‌ట‌. అమ‌రావ‌తి ల్యాండ్ పూలింగ్‌ - స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తిలో సింగ‌పూర్ క‌న్సోర్టియ‌మ్ ఎంపిక‌ - అగ్రిగోల్డ్ భూముల వ్య‌వ‌హారం - విశాఖ భూ కుంభ‌కోణం వంటి అంశాల‌కు సంబంధించి ఐవైఆర్ ద‌గ్గ‌ర కీల‌క సాక్షాధారాలున్నాయ‌ని స‌మాచారం.

రాబోయే సాధార‌ణ‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు అవినీతి - అన్యాయాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో ఐవైఆర్ కీల‌క పాత్ర పోషిస్తార‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నార‌ని వినికిడి. ఐవైఆర్‌ ను త‌మ పార్టీలో చేర్చుకొని చంద్ర‌బాబును ఇరుకున ప‌డేయాల‌ని వైసీపీ భావిస్తోంద‌ట‌.

ఇందులో భాగంగానే త్వ‌ర‌లో వైసీపీ ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి ఆధ్వ‌ర్యంలో గుంటూరులో బ్రాహ్మ‌ణ గ‌ర్జ‌న పేరుతో ఓ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారని స‌మాచారం. ఈ సభ‌కు ఐవైఆర్ హాజ‌ర‌వుతార‌ని, ఈ స‌భ‌కు జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని వినికిడి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/