Begin typing your search above and press return to search.

రాష్ట్రం కోసం పాద‌యాత్ర‌ను ఆపేస్తున్న జ‌గ‌న్ !

By:  Tupaki Desk   |   7 Feb 2018 7:30 AM GMT
రాష్ట్రం కోసం పాద‌యాత్ర‌ను ఆపేస్తున్న జ‌గ‌న్ !
X
స‌రిగ్గానే రాశాం. శీర్షిక‌లో త‌ప్పేం దొర్ల‌లేదు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను ఆపుతున్నారు. ఏ బ‌డ్జెట్ లోనూ ఏపీకి నిధులు ఇవ్వ‌ని కేంద్రంపై పోరు ఉధృతం చేయ‌డం కోసం - ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తెచ్చిన కేంద్రంపై ఒత్తిడి తేవ‌డం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ గురువారం త‌న పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇస్తున్నారు. గురువారం రాష్ట్ర బంద్‌ కు వైసీపీతో పాటు ప‌లు ప్ర‌జా సంఘాలు - కొన్ని పార్టీలు పిలుపునిచ్చాయి. ఏపీ ప్ర‌జ‌ల ఆవేద‌న కేంద్రానికి తెలియ‌జేయ‌డానికి ఊరు ఊరులోనూ నిర‌స‌నలు తెల‌పాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది.

బంద్ నేప‌థ్యంలో త‌ను ప్ర‌జా సంక‌ల్ప‌ పాద‌యాత్ర‌ను కొన‌సాగించ‌డం స‌రైన‌ది కాద‌ని, తెలుగు ప్ర‌జ‌ల‌కు - ఏపీ సంక్షేమానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని - ప్ర‌తి మండ‌లంలోనూ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేయాల‌ని జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కు సూచించారు. ప్ర‌తి వైసీపీ కార్య‌క‌ర్త కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని జ‌గ‌న్ పిలుపునిచ్చారు.

మ‌రోవైపు కేంద్రం తెలుగు ఎంపీలు నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్నారు. ఏపీకి స్ప‌ష్ట‌మైన హామీ వ‌చ్చే వ‌ర‌కు పోరాడ‌తామ‌ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్ల‌మెంటు లోప‌ల‌ - పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో వైసీపీ నేత విజ‌య‌సాయి రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ప్ల‌కార్డులు చేత ప‌ట్టి ధ‌ర్నాకు దిగారు. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రానికి అన్యాయం చేయ‌కండి - వెంట‌నే నిధులు ఇవ్వండి అని విజ‌య‌సాయిరెడ్డి కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.