Begin typing your search above and press return to search.

వైఎస్‌.. కేసీఆర్ ల‌లో ఉన్న‌ది.. బాబులో లేనిదిదే!

By:  Tupaki Desk   |   1 April 2019 7:31 AM GMT
వైఎస్‌.. కేసీఆర్ ల‌లో ఉన్న‌ది.. బాబులో లేనిదిదే!
X
ఐదేళ్ల పాటు అధికారం చేతిలో పెట్టిన ప్ర‌జ‌ల‌కు కావాల్సిన‌వ‌న్నీ ఇవ్వాలే కానీ.. ఓట్ల కోసం ఊరూరా తిరగాల్సిన అవ‌స‌రం ఉందా? అందులోకి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాదిరి ఓట్లు అడుక్కోవాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న భావ‌న కలుగ‌క మాన‌దు. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నే తీసుకుంటే.. 2009 ఎన్నిక‌ల వేళ‌.. ఆయ‌న తాను చేసిన ప‌థ‌కాల గురించి చెప్పారే కానీ.. కొత్త ప‌థ‌కాన్ని ఒక్క‌టి కూడా ప్ర‌క‌టించ‌లేదు.

హోరాహోరీగా సాగిన ఎన్నిక‌ల్లో వైఎస్ అపూర్వ విజ‌యం సాధించారు. అంతెందుకు.. 2018లో ముంద‌స్తుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌చార శైలిని చూసినా.. ఆయ‌న తాను చేసిన పాల‌న గురించి చెప్ప‌టం.. తెలంగాణ‌లో వేలెడుతున్న చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న తెచ్చే వారే త‌ప్పించి.. బాబు ఇప్పుడు చేస్తున్న స్థాయిలో ప్ర‌చారం చేయ‌టం క‌నిపించ‌దు.

ఎందుకిలా అంటే.. త‌మ ప‌ద‌వీ కాలంలో ప్ర‌జ‌ల‌కు సంతృప్తిక‌ర‌మైన పాల‌న అందించిన‌ప్పుడు.. మ‌ళ్లీ ఓట్లు అడిగే వేళ వారి వ‌ర‌కు వారికి ఎడ్జ్ ఉంటుంది. అలాకాకుండా బాబు మాదిరి ఐదేళ్ల పాల‌న త‌న వారికి మేలు జ‌రిగేలా.. త‌ప్పులు జ‌రుగుతుంటే చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం చేసిన‌ప్పుడు... వాటికి వివ‌ర‌ణ ఇవ్వ‌టానికి బ‌దులుగా క‌వ‌రింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం విప‌రీత‌మైన ప్ర‌యాస త‌ప్ప‌దు.

తాజాగా చంద్ర‌బాబు చేస్తున్న‌ది ఇదే. ఐదేళ్ల త‌న విఫ‌ల పాల‌న‌లో తాను చేయ‌ని ప‌నుల్ని చేసిన‌ట్లుగా చెప్ప‌టం.. కొత్త ఆశ‌ల్ని తెర మీద‌కు తేవ‌టం.. కొత్త అబ‌ద్ధాల్ని ప్ర‌చారంలోకి తేవ‌టం లాంటివి చేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే.. బాబును విప‌రీతంగా క‌ష్ట‌ప‌డేలా.. చెమ‌ట‌లు క‌క్కేలా చేస్తోంది. క‌ష్టం చేయ‌టం త‌ప్పు కాదు. కానీ.. ఐదేళ్ల పాటు ఇదే క‌ష్టాన్ని న‌మ్ముకొని ఉంటే ఈ రోజు ఇంత‌లా కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని ఊరూరు తిర‌గాల్సిన అవ‌స‌రం ఉండ‌దు క‌డా?