Begin typing your search above and press return to search.
ప్రత్యేక హోదాను బాబు, మోడీ తొక్కేశారు - షర్మిల
By: Tupaki Desk | 31 March 2019 12:55 PM GMTవైఎస్ షర్మిల వాగ్గాటి చూస్తుంటే... నిజంగా జగన్ బాణమే అనిపించే పరిస్థితి. చంద్రబాబు హామీల గురించి జగన్ కంటే స్ట్రాంగ్ గా దుమ్ము దులుపుతోంది షర్మిల. బస్సుయాత్రతో విశేషంగా ఆకట్టుకుంటున్నారావిడ. ఈరోజు పెదకూరపాడులో ఆమె ప్రసంగిస్తూ... పార్లమెంటులో హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాని తొక్కి పట్టింది నరేంద్ర మోడీ అయితే, ఆయనకు సహకరించింది చంద్రబాబు కాదా అని విమర్శించారు.
చంద్రబాబు మాటలతో మాయ చేస్తాడు. ఆయన అడగడుగునా ఆయనది మోసమే. సెల్ ఫోన్లు ఇస్తాను అన్నాడు. ఎందుకు ఇవ్వలేదు? మీకు సెల్ ఫోన్లు అందాయా? లేదు. రుణమాఫీ చేస్తాను అన్నాడు డ్వాక్రా రుణమాఫీ చేశారా? లేదు. జనాల్ని ఓట్లడిగితే తన్ని తరిమేస్తారని... ఇపుడు పసుపు, కుంకుమ అంటున్నాడు. ఎన్నికల ముందు మోసం చేస్తున్నారు. 600 హామీలు ఇచ్చి అడిగితే ఇపుడు ఆ మేనిఫెస్టో దొరకడం లేదంటున్నాడు. టీడీపీ వెబ్ సైట్లో కూడా మిస్సయ్యిందట ఆ మేనిఫెస్టో.
చంద్రబాబు చేతిలో మోసపోని ఆంధ్రుడే లేడని ఆమె వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ అటకెక్కించాడు. జబ్బు వస్తే గవర్నమెంటు ఆస్పత్రికి పొమ్మంటున్నాడు. ఆయన ఇంట్లో వారిని గవర్నమెంటు ఆస్పత్రికే పంపిస్తున్నాడా? బాబు వచ్చాడు. నోటిఫికేషనే రాలేదు. ఇక జాబు ఎలా వస్తుంది? ఈ రాష్ట్రంలో జాబు వచ్చింది ఒకరికే... అది పప్పుకు.
ఆ పప్పు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పప్పుకు వర్థంతికి జయంతికి తేడా తెలియదు. అలాంటి వ్యక్తి 3 శాఖలకు మంత్రి కావడం ఏపీ ఖర్మ. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుతో పారిపోతుంది... ఆయనను ఇంకోసారి నమ్మితే జీవితంలో కోలుకోలేం అని షర్మిల వ్యాఖ్యానించారు. జగనన్నకు ఓటేసి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని ఆమె పిలుపునిచ్చారు.