Begin typing your search above and press return to search.

ష‌ర్మిల చివ‌రగా చెబుతున్న‌ మాట అదిరిందిగా..!

By:  Tupaki Desk   |   30 March 2019 5:48 AM GMT
ష‌ర్మిల చివ‌రగా చెబుతున్న‌ మాట అదిరిందిగా..!
X
జ‌గ‌న‌న్న వదిలిన బాణాన్ని అంటూ తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ సంచ‌ల‌నం సృష్టించ‌ట‌మే కాదు.. ధైర్యానికి ధైర్యం.. తెగువ‌కు తెగువ‌.. ట‌న్నులు.. ట‌న్నులుగా ఉండే వైఎస్ ష‌ర్మిల మ‌ళ్లీ మైకు ప‌ట్టుకున్నారు. మొన్న‌టికి మొన్న విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించిన ఆమె.. ఆ సంద‌ర్భంగా చెప్పిన మాట‌ను తూచా త‌ప్ప‌కుండా ఆచ‌రించారు. తాను ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని మొద‌లు పెడ‌తాన‌ని.. ఆమె చెప్పిన‌ట్లే మంగ‌ళ‌గిరి నుంచి షురూ చేశారు.

త‌న ప్ర‌సంగంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దుర్మార్గ పాల‌న‌.. వైఎస్ దేవుడి పాల‌నను గుర్తు చేసిన ఆమె.. బాబు కుమారుడు లోకేశ్ మీద విసురుతున్న పంచ్ లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. అన్నింటికి మించి.. ఆఖ‌రి పంచ్ మ‌న‌దైతే ఆ ఇక్కే వేర‌బ్బా అన్న డైలాగును గుర్తు చేసేలా.. త‌న ప్ర‌సంగం చివ‌ర్లో ఆమె నోటి నుంచి వ‌చ్చిన మాట‌కు జ‌నాల నుంచి వ‌స్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాద‌ని చెబుతున్నారు.జ‌గ‌న్ కు అధికారాన్ని అందించాల్సిన అవ‌స‌రాన్ని చెప్ప‌ట‌మే కాదు..ఏపీకి జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రి చేస్తే క‌లిగే లాభాల గురించి ఆమె చెబుతున్నారు.

త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చ‌నిపోయి ప‌దేళ్లు కావొస్తున్నా.. ఇప్ప‌టికి ఆయ‌న అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల మీద చ‌ర్చ జ‌రుగుతుంద‌ని.. ఇప్ప‌టికి ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో వైఎస్ నిలిచిపోయిన‌ట్లుగా చెప్పారు.

ఇంత‌కీ ష‌ర్మిల త‌న ప్ర‌సంగంలో చివ‌ర్లో చెబుతున్న మాట ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే.. ఏపీ ముఖ్య‌మంత్రిచంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు మంత్రి లోకేశ్ కు బైబై చెప్పాల్సిన టైం వ‌చ్చేసింద‌ని చెబుతున్నారు. ఈ మాట‌ను ఇలా చెబితే ఆమె ష‌ర్మిల ఎందుక‌వుతారు? ఇదే మాట‌ను ష‌ర్మిల త‌న‌దైన స్టైల్లో చెబుతూ.. బైబై బాబు - బైబై పప్పు అని వ్యాఖ్యానించి కార్య‌క‌ర్త‌ల్లో.. అభిమానుల్లో జోష్ ను పీక్స్ కు తీసుకెళ్లారు.

మంగ‌ళ‌గిరి స‌భ‌లో ష‌ర్మిల మాట్లాడిన మాట‌ల్లో కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చూస్తే..

+ 2014లో రైతు రుణమాఫీలు పూర్తిగా చేస్తామని అధికారంలోకి వస్తే తన తొలిసంతకం రుణమాఫీ ఫైలుమీదే ఉంటుందని చెప్పి ప్రభుత్వంలోకి వ‌చ్చారు చంద్ర‌బాబు. ఆ తొలి హామీకే దిక్కులేదు.

+ కొత్తగా పసుపు కుంకుమ పేరుతో మహిళలను మళ్లీ మోసం చేసేందుకు సిద్దమయ్యారు. ఆరోగ్యశ్రీలో పలు హాస్పిటళ్లను లిస్టు నుంచి తీసేశారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవి త‌న కుటుంబానికి జబ్బు చేస్తే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటారు. మ‌రి పేదవాడికి జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్లాలి?

+ బాబు వస్తే జాబు వస్తుందనే ప్రచారం చేశారు.అయితే... తన కుమారుడు లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం వ‌చ్చింది. జయంతికి వర్ధంతికి తేడా తెలియదు అత‌డికి. లోకేష్‌కు ఏం అనుభవం ఉందని మూడు పోర్ట్‌ఫోలియోలు కట్టబెట్టారు?

+ చంద్రబాబుకు నిజం చెప్పడం చేతకాదు. ఆయ‌న ఏ రోజైతే నిజం చెబుతారో ఆరోజు చంద్రబాబు తల వేయి ముక్కలు అవుతుంది . అందుకే బాబు నిజం చెప్పరు.

+ హైదరాబాదులో ఉంటే కేసులు పెడతారేమోనని విజయవాడకు పారిపోయి వచ్చారు చంద్ర‌బాబు. హరికృష్ణ మృతదేహం ముందు టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటామని చంద్ర‌బాబు చెప్పారు. ఇప్పుడేమో వైఎస్సార్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

+ సింహం సింగిల్‌గా వస్తుంది. అలా వ‌చ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ బంప‌ర్ మెజార్టీతో గెల‌వ‌నుంది. దేశంలో అన్ని సర్వేలు ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి.మాకు ఎవరితోను పొత్తు పెట్టుకునే అవసరం దాపురించలేదు.

+ పొరపాటున కూడా ప్రజలు తమ భవిష్యత్తును చంద్రబాబు చేతిలో పెడితే నాశనమే. జగన్ విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. ఆయ‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వాలి.