Begin typing your search above and press return to search.
అమ్మో చెల్లెమ్మా : కేసీయార్ కి డైరెక్ట్ గా... అన్నకు ఇండైరెక్ట్ గా...?
By: Tupaki Desk | 26 July 2022 3:51 AM GMTరాజకీయాలలో అనుభవం ఉండాలని అంటారు. కానీ వర్తమానంలో చూస్తే ముందు లోతు తెలియకుండా దిగిపోయినా అక్కడే అంతా అనుభవం వస్తుంది. ఇక ఇంట్లో వంట్లో రాజకీయం ఉన్న వైఎస్సార్ ఫ్యామిలీకి పాలిటిక్స్ గురించి ట్రిక్స్ గురించి వేరే చెప్పాలా. తండ్రి కంటే ఘనమైన రాజకీయం చేస్తూ ఏపీలో జగన్ పవెర్ ఫుల్ అనిపించుకున్నారు. మరి ఆ ఇంటి ఆడపడుచు షర్మిల కూడా తక్కువ తింటారా. అందుకే ఆమె తెలంగాణా గడ్డ మీద తన రాజకీయాన్ని పండిస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీయార్ ని విమర్శిస్తూ అదే నోటితో అన్నకు కూడా నాలుగు అనాల్సినవి అనేశారు. అయితే ఇక్కడ చిత్రమేంటి అంటే కేసీయార్ మీద డైరెక్ట్ గానే విరుచుకుపడ్డారు. అన్న మీద మాత్రం ఇండైరెక్ట్ గా అంటించాల్సినవి అంటించేశారు. ఇందులో రాజకీయ జనాలకూ తెలియని విషయాలు బోలెడు ఉన్నాయి. అవేంటి అంటే జగన్ కేసీయార్ ల మధ్య ఎడం ఉందని, అసలు మాట్లాడుకోరని, ఇద్దరి దారులు వేరని ఒక పిక్చర్ అయితే బయట ఉంది. కానీ అదేమీ కాదని షర్మిలమ్మ మాటల ద్వారా సెటైర్ల ద్వారా చెప్పేశారు. ఆ లోగుట్టు ఏంటో ఇట్టే విప్పేశారు.
మీరూ మీరూ దోస్తులు కదా అంటూ ఆమె ఆడిన వెటకారం వెనక కారం కేసీయార్ జగన్ లకే తెలుసు కదా. అదే విధంగా మంతనాలు ఆడుకుంటారు. స్వీట్లు తినిపించుకుంటారు అని కూడా దెప్పిపొడిచారు. ఇద్దరూ కౌగిలింతల మీద కూడా పంచులు వేసిన షర్మిల బెస్ట్ ఫ్రెండ్స్ కదా పోలవరం వల్ల సమస్యలు ఉంటే ఎందుకు కూర్చుని మాట్లాడుకోరని లాజిక్ పాయింట్ తీశారు. మీది రాజకీయ లబ్ది అని కూడా అనేశారు. పైగా పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్ అన్నది కేసీయారే కదా అని కూడా గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ వల్లనే భద్రాచలానికి సమస్య అయితే అది ఇన్నాళ్ళ దాకా కేసీయార్ సార్ ఎందుకు చెప్పలేదని తప్పు కరెక్ట్ గానే ఎత్తి చూపారు. అసలు కేసీయార్ భద్రాచలం వెళ్ళిందెపుడు అని కూడా ఆమె గతాన్ని లాగి బయటకు తీశారు అపుడెపుడో సీఎం అయిన కొత్తల్లో వెళ్లారని, మళ్ళీ ఇన్నాళ్ళకు కేసీయార్ వరదలు వస్తే అక్కడకి వెళ్ళి గట్టున నిలబడి పిట్టకధలు చెప్పారని ఎద్దేవా చేశారు.
భద్రాచలం వల్ల కరకట్ట కూడా లేదంటే ఏంటి సారూ అని కేసీయార్ పాలననే గుచ్చి వదిలేశారు. ఇక భారీ వరదలు వచ్చి జనాలు నానా విధాలుగా అవస్థలు పడుతూంటే విదేశీ కుట్ర క్లౌడ్ బరస్ట్ అంటూ ఏవేవో సాకులు చెబుతున్నారని కూడా షర్మిల మండిపడ్డారు. మధ్యలో పోలవరాన్ని తీసుకుని వచ్చి జనాలకు కొత్త విషయాలను ఎందుకు చెబుతున్నారని అన్నారు.
సరే ఈ విమర్శలు అన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కేసీయార్ ల మధ్య అనుబంధాన్ని బయటపెట్టి మరీ షర్మిల వేసిన సెటైర్లు, చేస్తున్న విమర్శలు కేసీయార్ తో పాటు జగన్ కి కూడా బాగానే గుచ్చుకుంటాయని చెప్పాలి. షర్మిల పార్టీతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని వైసీపీ నేతలు ఆ మధ్య ప్రకటించి చెల్లెలు రుణాన్ని అలా వదిలించేసుకున్నారు.
మరి చెల్లెమ్మ కూడా చెల్లుబాటు చేయాలి కదా అని కాబోలు అన్నను పేరెత్తకుండా కేసీయార్ ని ముందు పెట్టి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ముందు ముందు ఏపీ తెలంగాణా సీఎం ల రాజకీయ బంధాన్ని చెప్పి అటూ ఇటూ కూడా ఇద్దరు సీఎంలకు కొత్త తలనొప్పులు తీసుకురావడానికి చెల్లెమ్మ రెడీ అయిపోయిందంతే. దానికి ఉదాహరణే తాజా ప్రెస్ మీట్. ఇది జస్ట్ శాంపిల్ముం మాత్రమే. ముందు ముందు సినిమా పూర్తిగా చూడాల్సిందే అంటున్నారు.