Begin typing your search above and press return to search.

కాళేశ్వరం అవినీతిపై సీబీఐకి వైఎస్ షర్మిల ఫిర్యాదు?

By:  Tupaki Desk   |   7 Oct 2022 11:30 AM GMT
కాళేశ్వరం అవినీతిపై సీబీఐకి వైఎస్ షర్మిల ఫిర్యాదు?
X
వైఎస్ షర్మిల అన్నంత పని చేశారు. తెలంగాణ అవినీతిపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల వేళ పగతో రగిలిపోతున్న బీజేపీకి ఆయువు పోశారు. ఈ పరిణామం ఖచ్చితంగా టీఆర్ఎస్ సర్కార్ పై ఏదో రకంగా ప్రభావం చూపనుంది. ఇక తెలంగాణలో ప్రాజెక్టులు పట్టిన కాళేశ్వరం రూపకర్తలు మేఘా సంస్థకు దెబ్బనే. ఇక వీరే ఏపీలోనూ పోలవరం కడుతున్నారు. జగన్ కు సన్నిహితంగా ఉన్నారు. సో అన్నయ్య మిత్రుడిని కూడా వైఎస్ షర్మిల తెలంగాణ అవినీతిలో బుక్ చేశారని ప్రచారం సాగుతోంది.

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ డైరెక్టర్ ను కలిశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ దానిపై విచారణ జరపాలని సీబీఐని కోరినట్టు సమాచారం. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని షర్మిల కోరినట్టు సమాచారం.

వైఎస్ఆర్ టీపీ పెట్టిన తర్వాత షర్మిల తొలిసారి ఢిల్లీ వెళ్లారు. ఏకంగా సీఎం కేసీఆర్ పై సీబీఐకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఢిల్లీ పెద్దలతో భేటి కానున్నారు. కేంద్రమంత్రులను కలవనున్నారు.

వైఎస్ షర్మిల ఒకే దెబ్బకు అటు కేసీఆర్ ను, ఇటు జగన్ నే కాదు.. వారిద్దరికీ సన్నిహితంగా మెదులుతున్న మేఘా కృష్ణారెడ్డికి ఎసరు పెట్టేశారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కీలకమైన అతిపెద్ద ప్రాజెక్టులు కట్టారు.

ఒకటి కాళేశ్వరం, రెండు పోలవం.. ఈ రెండు రెండు రాష్ట్రాలకు జీవనాడి. కేసీఆర్, జగన్ లకు ఎంతో సన్నిహితుడైన ఈ వ్యాపారవేత్తను కూడా షర్మిల బుక్ చేసినట్టు గెలుస్తోంది.

షర్మిల ఫిర్యాదు ఆధారంగా సీబీఐ విచారణ జరుపుతుందా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక గతంలోనూ జగన్ ను జైలు పాలు చేయడానికి నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు ఫిర్యాదుతో కాంగ్రెస్ అధిష్టానం ఫిర్యాదు చేయించింది. ఇప్పుడు షర్మిల వెనుకాల కూడా బీజేపీ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.