Begin typing your search above and press return to search.

బల్లిని చూసి కేకలు పెట్టిన షర్మిల!

By:  Tupaki Desk   |   11 Jun 2021 3:30 PM GMT
బల్లిని చూసి కేకలు పెట్టిన షర్మిల!
X
తెలంగాణ రాజకీయాల్లోకి ధైర్యంగా వచ్చి సీఎం కేసీఆర్ నే సవాల్ చేస్తూ ఉక్కుమనిషిలా నిలబడ్డారు వైఎస్ షర్మిల. అన్న జైలుపాలైన ఏపీలో వైసీపీని నిలబెట్టి పాదయాత్ర చేసి నాడు చంద్రబాబు, లోకేష్ లాంటి గండర గండరలునే ఎదుర్కొన్నారు. ఈ ఒంటరి మహిళ ఇప్పుడు తెలంగాణలోనూ ఉద్యమాలతో హీటెక్కిస్తున్నారు.

అంతటి ధైర్యం గల వైఎస్ షర్మిల ఓ చిన్న ప్రాణిని చూసి భయపడింది. బల్లిని చూసి కేకలు వేసింది. వికారాబాద్ జిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిల ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై సీఎం కేసీఆర్ ను నిలదీశారు. రైతులకు అండగా ఉంటానని.. రైతులు పండించిన పంటను కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఈ పర్యటనలో భాగంగా సంచుల్లో పోసి కప్పి ఉంచి ధాన్యాన్ని పరిశీలించాలనుకుంది షర్మిల. వరిధాన్యంపై కప్పి ఉన్న సంచిని తొలగించగా.. అక్కడ బల్లి కనపడింది. దీంతో అది కదలడంతో కేకలు వేస్తూ రెండు చేతులతో చెవులు మూసుకొని భయంతో వెనక్కి జరిగారు.

ఇది గమనించిన గన్ మన్ వచ్చి చూడగా బల్లి కిందపడిపోయింది. బల్లి అని చెప్పడంతో తర్వాత షర్మిల ముందుకు కదిలారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.