Begin typing your search above and press return to search.
బాణం బయటకు; తెలంగాణలో మళ్లీ పరామర్శ
By: Tupaki Desk | 29 Jun 2015 5:31 AM GMTదివంగత మహానేత పేరు చెప్పుకొని..తమకు వీలు కుదిరిన ప్రతిసారీ.. పరామర్శ పేరుతో పర్యటనలు చేయటం వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్‌కు అలవాటే. అప్పుడెప్పుడో అంటే.. దాదాపు ఆరేళ్ల క్రితం వైఎస్ మరణిస్తే.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని పలువురు ప్రాణాలు వదిలారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు.. అప్పటి నుంచి మొదలైన పరామర్శల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది.
పరామర్శ అన్నది రాజకీయం చేసేసిన జగన్ అండ్ కో.. తాజాగా అలాంటిదే మరొకటి స్టార్ట్ చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన గురించి తాను పరిచయం చేసుకునే జగన్ సోదరి షర్మిల.. గత కొద్దికాలంగా తెలంగాణ ప్రాంతంలో పరామర్శ యాత్ర చేయటం తెలిసిందే.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై జైలుకు వెళ్లిన సమయంలో మొదలు పెట్టిన పరామర్శ యాత్రను.. తనకు కుదిరినప్పుడల్లా.. రాజకీయంగా కాస్త బలహీనంగా అయ్యానన్న భావన కలిగిన ప్రతిసారీ పరామర్శ యాత్రకు వచ్చే షర్మిల తాజాగా తన యాత్రను మరోసారి షురూ చేయనున్నారు.
ఈసారి దాదాపు నాలుగు రోజుల పాటు సాగే ఈ యాత్రలో మొత్తం 590 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. మొత్తంగా పదిహేను కుటుంబాలను పరామర్శిస్తారు. ఎంతకూ పూర్తి కాని ఈ పరామర్శ యాత్రల పరంపర ఎప్పటికి పూర్తి అయ్యేనో..?