Begin typing your search above and press return to search.

జగన్ బర్త్ డే లో ఆమె మిస్ అవడమే హైలెట్

By:  Tupaki Desk   |   21 Dec 2022 11:00 PM IST
జగన్ బర్త్ డే లో ఆమె మిస్ అవడమే హైలెట్
X
జగన్ తన యాభై పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. మనిషి జీవితంలో ల్యాండ్ మార్క్ లాంటిది యాభై పడిలో పడడం. పైగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు జగన్. దాంతో స్వర్ణోత్సవ సంబరాలు అంటూ చాలా రోజులుగా పార్టీ జనాలు హడావుడి చేస్తూనే ఉన్నారు. ఇక పుట్టిన రోజున మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యాడర్ అంతా కలసి ఘనంగానే వేడుకలను చేశారు.

జగన్ నివాసం కూడా కళకళలాడింది. ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, చిన్నమ్మ స్వర్ణలత, బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి హాజరై దీవించారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంది చంద్రబాబు వరకూ ఇటు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు అంతా జగన్ని గ్రీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జగన్ని గ్రీట్ చేసిన వారిలో ఉన్నారు.

మరి ఇంతమంది గ్రీట్ చేసినా ఒకే ఒక్క లోటుగా ఉంది. అదే జగన్ ఏకైక చెల్లెలు అయిన వైఎస్ షర్మిల తన అన్న పుట్టిన రోజు వేళ గ్రీట్ చేయకపోవడం మాత్రం కొట్టొచ్చినట్లుగానే కనిపించింది అని అంతా అంటున్నారు. జగన్ నివాసంలో తల్లి పినతల్లి బాబాయ్ అంతా ఉన్నా ఆ గ్రూప్ ఫోటోలో ఉండాల్సిన చెల్లెలు షర్మిల కనిపించకపోవడం మాత్రం వెలితిగానే ఉంది అంటున్నారు.

ఈ ఫోటో వైరల్ అవుతోందిపుడు. అంతలా అన్నా చెల్లెలు మధ్య విభేదాలు ఉన్నాయా అన్న చర్చకు కూడా తావిస్తోంది. ఈ మధ్యనే షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఏపీ ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్ గా విమర్శించారు. ఆయన విశాఖ జిల్లా భీమిలీ టూర్ లో మాట్లాడుతూ ఏపీ నుంచి జనాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు అని కూడ భారీ సెటైర్లు వేశారు.

ఇక షర్మిల అయితే జగన్ వ్యతిరేక క్యాంప్ వారితో ముచ్చట్లు పెడుతున్నారు అన్న ప్రచారం ఉంది. దుష్ట చతుష్టయం అని జగన్ ఏ మీడియాను అయితే నిందిస్తారో ఆ మీడియాతోనే షర్మిల ఇంటర్వ్యూలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ వివేకా హత్య కేసులో కూడా షర్మిల వాంగ్మూలం ఇవ్వడంతో పాటు వైఎస్ సునీతకు మద్దతుగా నిలవడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి.

ఇక షర్మిల పుట్టిన రోజు ఈ నెల 17న జరిగింది. అయితే ఆ రోజున మంత్రి రోజా లాంటి వారు షర్మిలకు గ్రీట్ చేసినా జగన్ నుంచి ట్వీట్ లేదని అనుకున్నారు.బహుశా ఆ కారణం వల్ల కూడా అన్న పుట్టిన రోజుకు షర్మిల గ్రీట్ చేయలేదు అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా అన్నాచెల్లెళ్ళ మధ్య విభేదాలు ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నాయా అన్నది మాత్రం బర్త్ డే సాక్షిగా మరోసారి చర్చకు తావిచ్చినట్లు అయింది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.