Begin typing your search above and press return to search.

షర్మిల పైత్యం ఎక్కువ అయ్యిందా?

By:  Tupaki Desk   |   30 Sep 2022 4:53 AM GMT
షర్మిల పైత్యం ఎక్కువ అయ్యిందా?
X
తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్రనే కాదు.. ఆమె మాటలు వేడిపుట్టిస్తున్నాయి. అసలేం మాట్లాడుతుందో.. ఎవరిని టచ్ చేస్తుందో కూడా తెలియకుండా వాగేస్తోంది. జగ్గారెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ తో పెట్టుకొని అనవసరంగా పరువు పొగొట్టుకుంటోంది. జగ్గారెడ్డి నియోజకవర్గంలోకి వచ్చి ఆయనపై పరుష పదజాలంతో తిడితే ఆయన ఊరుకుంటాడా? అన్నీ పూసగుచ్చినట్టు చెప్పేసి షర్మిల పరువు తీశాడు. వైఎస్ఆర్ శవం పక్కన ఉండగా.. సీఎం కుర్చీ కోసం జగన్, షర్మిల మంతనాలు జరిపిన తీరును.. వారికి అసలు బాధేలేదన్న కఠిన వాస్తవాలు చెప్పాడు. మరింతగా తిడితే నీ బండారం బయటపెడుతానని హెచ్చరించాడు. షర్మిల పైత్యపు మాటలే ఇలా రివర్స్ అయ్యి జగ్గారెడ్డి నోటి నుంచి ప్రతిస్పందన తీవ్రంగా రావడానికి కారణమైంది.

ఏమన్నా అంటే వైఎస్ఆర్ నామ జపం చేస్తోంది. అసలు తెలంగాణకు విలన్ నే వైఎస్ఆర్. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే ఏపీలోని నంద్యాల వెళ్లి.. 'తెలంగాణ ఏర్పడితే ఆంధ్రులు అంతా పాస్ పోర్ట్ పట్టుకొని వెళ్లాల్సిందే' అని మాట్లాడాడు. నిజానికి వైఎస్ఆర్ ఉంటే తెలంగాణ వచ్చేది కాదు.. కేసీఆర్ ఇలా సీఎం అయ్యిండేవాడు కాదు. అంతలా టీఆర్ఎస్ ను, తెలంగాణ వాదాన్ని దెబ్బతీసిన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది వైఎస్ఆర్.

ఆయనను తెలంగాణ ప్రజలకు హీరోలా ప్రొజెక్ట్ చేస్తున్న షర్మిలను అందుకే జనాలు నమ్మడం లేదు. చరిత్రను ఎప్పుడు ఎవరూ మరవరు. తెలంగాణ ప్రజల్లో వైఎస్ఆర్ ను హీరోను చేద్దామన్న షర్మిల ప్రయత్నాలు అందుకే విఫలమవుతున్నాయి. ఏపీలో ఓకే.. వైఎస్ఆర్ వల్లే జగన్ సీఎం అయ్యారు. కానీ అదే స్ట్రాటజీ తెలంగాణలో వర్కవుట్ అవ్వడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైఎస్ఆర్ ఇప్పుడు పార్టీ మారలేదు అని షర్మిల అంటోంది..మళ్లీ వైఎస్ఆర్ పార్టీ కాదు అంటోంది.. వైఎస్ఆర్ ప్రేమించే వాళ్లు అయిన జగ్గారెడ్డి వాళ్లను తిడుతోంది.. అసలు షర్మిల స్ట్రాటజీ ఏంటో అర్థం కాక ఆమె చుట్టు తిరిగే వాళ్లు కూడా గందరగోళంలో పడుతున్న పరిస్థితి నెలకొంది.

నిజానికి షర్మిలకు తెలంగాణకు అస్సలు సంబంధం లేదు. ఏపీలో అన్న జగన్ తో పడక.. అక్కడ రాజకీయాల్లోకి రాలేక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణలో రాజకీయాల్లోకి షర్మిల వచ్చేసింది. తెలంగాణలో వైఎస్ఆర్ చరిష్మా వర్కవుట్ కాదని తెలిసినా 'వైఎస్ఆర్ పాలన తెస్తాను అని అంటోంది'.. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలన్నీ ఇప్పుడు కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్నారు. 'ఆరోగ్యశ్రీ, ప్రాజెక్టులు, స్కాలర్ షిప్స్' అన్నీ కొనసాగిస్తున్నారు. వాటన్నింటిని కూడా ఇంకా మెరుగుపరిచి మరిన్ని మెరుగైన పథకాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మారుతున్న ప్రజల ఆశలకు అనుగుణంగా ఇంకా మెరుగుదిద్ది మరీ అందిస్తున్నారు.

ఇంత చేస్తున్నా కూడా ఇంకా పాతచింతకాయ పచ్చడిలా వైఎస్ఆర్ పథకాలు అంటూ నేనే తోపు అని వైఎస్ షర్మిల విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. ఆమె బీపీ తెచ్చుకునే బదులు.. తాను బెదరను.. భయపడను అని మీడియా సమావేశాల్లో తొడలు కొడుతోంది. తెలంగాణలో అమె పార్టీకి ఏమాత్రం ఆదరణ రావడం లేదు.. ఎక్కడ తిరుగుతున్నా ప్రజల నుంచి స్పందన లేదు. 2వేల కి.మీల పాదయాత్ర ముగిసినా మీడియా, ప్రజలు పట్టించుకోవడం లేదు. ఆ ఫస్ట్రేషన్ లోనే ఆమె ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు. బలమైన నేతలను తిడితే వారు ప్రతి స్పందిస్తే తనకు కొంచెం మైలేజ్ వస్తుందననే ఇలా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. లేదంటే పైత్యం ఎక్కువై ఇలా నోరుపారేసుకుంటుందా? అని తెలంగాణ మేధావులు అభిప్రాయపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.