Begin typing your search above and press return to search.
వైఎస్ఆర్ వాచీ, సిరిసిల్ల చీర ధరించిన షర్మిల
By: Tupaki Desk | 9 April 2021 8:13 AM GMTతెలంగాణలో సరికొత్త పార్టీ ప్రారంభించేందుకు దివంగత వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల ఖమ్మం బయలు దేరారు. హైదరాబాద్ నుంచి కార్ల ర్యాలీ ద్వారా ఆమె ఖమ్మంకు చేరుకుంటున్నారు. సూర్యపేటలో లంచ్ చేయడానికి నిర్ణయించారు. మధ్య మధ్యలో కార్యకర్తలు, నేతలను కలుస్తూ షర్మిల పర్యటన కొనసాగుతోంది.
కాగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రారంభం వేళ ఆమె తండ్రి.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాడిన వాచీని ధరించారు. అలాగే తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సిరిసిల్ల నేతన్నలు నేసిన కాటన్ చీరను ధరించారు.
ఈ సాయంత్రం ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన సంకల్ప సభలో పార్టీను షర్మిల అధికారికంగా ప్రకటించనున్నారు. విధివిధానాలు, మార్గదర్శకాలు అదే వేదిక మీద వెల్లడించే అవకాశాలున్నాయి.
ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ లో ఈ బహిరంగ సభ ఏర్పాటైంది. పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి షర్మిల హైదరాబాద్ నుంచి బయలు దేరారు. చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట్ మీదుగా మధ్యాహ్నం చివ్వెంలకు చేరుకుంటారు. సాయంత్రం సభలో పార్టీ పేరు, గుర్తులు, రంగులు షర్మిల ప్రకటిస్తారు.