Begin typing your search above and press return to search.

కేటీఆర్ అంటే ఎవ‌రండీః ష‌ర్మిల

By:  Tupaki Desk   |   16 July 2021 11:06 AM GMT
కేటీఆర్ అంటే ఎవ‌రండీః ష‌ర్మిల
X
తెలంగాణ రాష్ట్ర మునిసిప‌ల్, ఐటీ శాఖ‌ల‌ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్ టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల సెటైర్లు వేశారు. కేటీఆర్ అంటే ఎవ‌రు? అని మీడియా ముఖంగా ప్ర‌శ్నించారు. ఆయ‌నెవ‌రో త‌న‌కు తెలియ‌దు అన్న‌ట్టుగా వ్యాఖ్యానించారు. శుక్ర‌వారం ష‌ర్మిల మీట్ ది ప్రెస్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ కు సంబంధించి ఓ పాత్రికేయుడు ప్ర‌శ్నించ‌గా.. అస‌లు కేటీఆర్ అంటే ఎవ‌రు? అని అడిగారు. ఆయ‌న ఎవ‌రు? అంటూ.. అటూ ఇటూ చూశారు. ఒక క్ష‌ణం త‌ర్వాత ఆమె ప‌క్క‌నున్న నేత‌.. 'ఆయ‌నే మేడ‌మ్‌ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు' అని చెప్పారు. అప్పుడు 'ఓహో.. కేసీఆర్ గారి కొడుకా' అంటూ ఎగ‌తాళిగా న‌వ్వారు. దీంతో.. అంద‌రూ న‌వ్వుకున్నారు.

అనంత‌రం మాట్లాడుతూ.. కేసీఆర్‌- కేటీఆర్ ను క‌లిపి విమ‌ర్శించారు. ''కేసీఆర్ మహిళలను గౌరవించట్లేదు. ఇక‌, ఆయ‌న కొడుకు కేటీఆర్ గౌర‌విస్తారా? అస‌లు టీఆర్ఎస్ లో ఎంత మంది మ‌హిళ‌లు ఉన్నారు? ఎంత మందిని పోటీలో నిల‌బెట్టారు? ఎంత‌మందిని గెలిపించుకున్నారు? ఎంత మందిని మంత్రుల‌ను చేశారు? ఒక్క మ‌హిళైనా మంత్రిగా ఉన్నారా.. ఒక్క‌రున్నార‌ను స‌రే. ఆమె టీఆర్ఎస్ నుంచి గెలిచారా? ప‌క్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా? వీళ్లా.. మహిళల గురించి మాట్లాడేదీ?'' అని ప్ర‌శ్నించారు.

ఇక, తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని అన్నారు. వారికి న్యాయం చేయాల‌నే ఉద్దేశంతోనే పార్టీని స్థాపించిన‌ట్టు చెప్పారు. వైఎస్సార్ టీపీ త‌న కోసం పెట్టిన పార్టీ కాదని, తెలంగాణ ప్ర‌జ‌ల కోసం పెట్టిన పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ అమ్ముడు పోయింద‌ని, టీఆర్ఎస్‌-బీజేపీ క‌లిసిపోయాయ‌ని అన్నారు. త్వ‌ర‌లో హుజూరాబాద్ లో జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌కు అర్థ‌మే లేద‌ని కూడా చెప్పారు. తెలంగాణ‌లో పార్టీని విస్త‌రించ‌డంలో భాగంగా త్వ‌ర‌లోనే రాష్ట్రంలో పాద‌యాత్ర నిర్వ‌హించ‌నున్న‌ట్టు చెప్పారు. చేవెళ్ల నుంచి పాద‌యాత్ర ప్రారంభించ‌నున్న‌ట్టు చెప్పారు.