Begin typing your search above and press return to search.
అన్నావదినలకు ప్రేమతో షర్మిలా గిఫ్ట్
By: Tupaki Desk | 28 Aug 2019 9:48 AM GMTవైఎస్ జగన్ ఏపీకి ముఖ్యమంత్రి.. సీఎం కాకముందు ఆయనో ప్రతిపక్ష నేత. పాదయాత్రతో జనం వెంట నడిచారు. లోప్రొఫైల్ మెయింటేన్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన రాష్ట్రాన్ని ఏలుతున్న నేత. ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఆయన గురించి.. ఆయనకు సంబంధించిన ప్రతీ విషయపైనా ఆసక్తి ఉండడం సహజం.
అయితే అందరూ సైలెంట్ గా ఉన్న వేళ.. జగన్ చెల్లెలు మాత్రం తన అన్నా వదినలకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ను ఇచ్చింది. సోషల్ మీడియా సాక్షిగా షర్మిల పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ పోస్టు ఏంటంటే ఈరోజు జగన్-భారతిల పెళ్లిరోజు.. జగన్ పెళ్లినాటి ఫొటోలను సోషల్ మీడియాలో షర్మిలా షేర్ చేసి విషెస్ చెప్పింది. దీంతో అందరూ ఆ పాతకాలం నాటి ఫొటోలను చూసి జగన్-భారతిలకు శుభాకాంక్షలు వెల్లువలా చెబుతున్నారు. షేర్లతో వైరల్ చేస్తున్నారు.
1996 ఆగస్టు 28న పులివెందులలోని లయోలా మైదానంలో జగన్-భారతిల వివాహం జరిగింది. జగన్ తోపాటు ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత వివాహం కూడా ఒకేసారి జరిగింది. జగన్- సునీత వివాహా ఆహ్వాన పత్రికను జగన్ తాత రాజారెడ్డి పేరుతోనే ముద్రించడం విశేషం. పులివెందులకే చెందిన గంగిరెడ్డి కుమార్తె భారతి సంబంధం చూసి రాజారెడ్డియే ఈ పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చేసి ఇద్దరు కుమారులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి- వివేకానందరెడ్డిల సంతానానికి పెళ్లి జరిపించారు.
జగన్ పెళ్లి నాటి అరుదైన ఫొటోలను షర్మిలా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. యువకుడిగా ఉన్న జగన్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. అందరూ జగన్ పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. అన్నయ్య పెళ్లిరోజును గుర్తుంచుకొని మరీ చెప్పిన చెల్లెలు షర్మిలా పోస్టు ఇప్పుడు వైరల్ అయ్యింది.