Begin typing your search above and press return to search.
షర్మిలకు భారీ డ్యామేజ్ గా మారిన.. ‘కేటీఆర్ పెద్ద మొగోడు కదా’ మాట
By: Tupaki Desk | 17 July 2021 6:30 AM GMTఅనూహ్యమైన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు వైఎస్ షర్మిల. తన మాటల్లో నాటకీయత.. అంతలోనే తన్నుకొచ్చే ఆవేశం.. మరింత లోతుకు వెళితే ఆవేదన.. మధ్య మధ్యలో మెరిసినట్లుగా కనిపించే భావోద్వేగం.. ఇలా అన్ని ఎమోషన్స్ ను బ్యాలెన్సు చేస్తూనే.. మధ్యలో జంపింగ్ జపాంగ్ లాంటి అనూహ్యమైన పదాల్ని వాడిన షర్మిల మాటలు ఇప్పుడు రాజకీయంగానే కాదు.. సాదాసీదా ప్రజల్లోనూ ఆసక్తికర చర్చకు తెర తీశాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అసలుసిసలు రాజకీయ వారసురాలిని తానేనని చెప్పేందుకు విపరీతంగా శ్రమిస్తున్న షర్మిల.. అదే సమయంలో తన ప్రత్యర్థులపై విరుచుకుపడే విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోకుండా ముక్కుసూటిగా.. ఆ మాటకు వస్తే ముఖం పగిలేలా ఉన్న ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తున్నాయని చెప్పక తప్పదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుగులేని అధినేతగా మారిన కేసీఆర్ ను కానీ.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన నేతలు తక్కువ మందే. వారి వ్యక్తిత్వాలకు మరక అంటించే వ్యాఖ్యలు చేసింది పెద్దగా లేదు. అన్నింటికి మించి మంత్రి హరీశ్ రావు మీద షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గి పుట్టించేలా ఉండటమే కాదు.. కొత్త సందేహాలకు తావిచ్చేలా చేశాయని చెప్పాలి. తెలంగాణ సాధన కోసం ఒంటి మీద పెట్రోల్ పోసుకున్న హరీశ్ రావు.. అగ్గి పెట్టె కోసం వెతుక్కున్నారని.. పెట్రోల్ డబ్బా తెచ్చుకున్నోళ్లు.. అగ్గిపెట్ట తెచ్చుకోవటం మర్చిపోతారా? అంటూ సంధించిన ప్రశ్న ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
తన రాజకీయ ప్రత్యర్థుల్ని చిన్నగా చేయటం..చులకన చేయటంలో కేసీఆర్ కు మించినోళ్లు ఎవరూ కనిపించరు. అలాంటి కేసీఆర్ స్టైల్ ను యథాతధంగా వాడేసిన షర్మిల తీరు గులాబీ నేతల్లో చర్చకు తెర తీసింది. కేటీఆర్ ప్రస్తావన వచ్చినంతనే.. ‘కేటీఆర్ ఎవరు? ఎవరమ్మా? ఓహ్.. తారక రామారావా? ముఖ్యమంత్రి కేటీఆర్ కొడుకా?’ అంటూ షర్మిల తీసిన దీర్ఘం చూస్తే.. తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు ముందు చాలానే కసరత్తు చేయటంతోపాటు.. బ్యాక్ గ్రౌండ్ వర్కు జరిగిన విషయాన్ని షర్మిల మాటలతో చెప్పకనే చెప్పేశారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అదే సమయంలో.. మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో షర్మిల నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు పరుషంగా ఉన్నాయన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. ‘కేటీఆర్ పెద్ద మొగోడు కదా’ అంటూ షర్మిల నోటి నుంచి వచ్చిన పదునైన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాలకు కాస్త కొత్తగా అనిపించక మానదు. కారణం.. ఇంతకాలం తెలుగు రాజకీయాల్ని శాసించింది పురుష పుంగవులే తప్పించి.. బలమైన ఏ మహిళ కూడా అధినేతగా తానేమిటన్నది చూపించింది లేదు. ఈ కారణంతో ఆడ.. మగ అన్నదెప్పుడు రాజకీయ చర్చ కాలేదు.
అందుకు భిన్నంగా షర్మిలపై కేటీఆర్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు మరింత ఘాటుగా బదులిచ్చిన షర్మిల తీరు ఇప్పుడు చర్చగా మారింది. ఎంత షర్మిల అయితేనేం.. కేటీఆర్ ను పెద్ద మొగోడు అంటారా? అని ప్రశ్నిస్తున్న వారు ఎక్కువ మందే కనిపిస్తున్నారు. రాజకీయాల్లో సభ్యత.. సంస్కారం లాంటివి వదిలేస్తే ఎలా? అని సంప్రదాయవాదులు విమర్శిస్తున్నారు. మరికొందరు కాస్త ముందుకెళ్లి.. కేటీఆర్ స్ట్రేచర్ ఏంటి? షర్మిల స్థాయి ఏమిటి? ఏ హక్కు ఉందని అన్నేసి మాటలు అనగలుగుతున్నారు? అన్న వాదనకు తెర తీశారు. నిజంగానే షర్మిల అవసరానికి మించి మాట్లాడారా? అన్నది చూస్తే.. మాటలు ఎంత ఘాటుగా అయినా ఉండొచ్చు.. కానీ కొన్ని పదాల్ని ప్రయోగించటం ఇబ్బందే అవుతుంది. అందులోని రాజకీయాల్లో ఒక్క చిన్న మాట తేడా కావొచ్చు.. మొత్తంగా డ్యామేజ్ కావటానికి.
తాజాగా షర్మిల వాడిన ‘‘మొగోడు’’ అన్న మాటను ఆమోదించే కంటే ఆగ్రహించే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి కారణం.. ఒక మహిళ నోటి నుంచి కాబోయే ముఖ్యమంత్రి స్థాయి నాయకుడ్ని అంత మాటను అలా అనేస్తారా? అన్నదే ప్రశ్న. నిజానికి కేటీఆర్ ను మరోలా విమర్శించి ఉంటే.. షర్మిల మాటపై ఇంత చర్చ జరిగేది కాదు. చూస్తుంటే.. ఏ పాయింట్ అయితే టచ్ చేయకూడదో.. దాన్నే టచ్ చేయటం ద్వారా తన గురించి చర్చ జరిగేలా చేయాలన్నదే షర్మిల ఆలోచనా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రానున్న రోజుల్లో ఆమె నోటి నుంచి వచ్చే మాటలు.. ఆమె ఉద్దేశాన్ని.. ఆమె వ్యూహాన్ని స్పష్టం చేస్తాయని చెప్పక తప్పదు. ఏమైనా.. ‘మొగోడు’ అన్న మాట కాస్త మొరటుగా ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అలాంటి వాటికి కాస్త దూరంగా షర్మిల ఉండటం మంచిదని చెబుతున్నారు. మరి.. ఆమె ఎలా ఉంటారన్నది కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.