Begin typing your search above and press return to search.
షర్మిలకు కేంద్రమంత్రి పదవి ఖరారా?
By: Tupaki Desk | 14 Feb 2020 4:30 AM GMTఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల నడుమ చోటు చేసుకుంటున్న రాజకీయాలకు అదనపు మలుపులు, ఆసక్తిదాయకమైన వ్యవహారాలు యాడ్ అయ్యేలా ఉన్నాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి వర్గంలో చేరబోతోందనే ఊహాగానాలు గత వారం రోజుల్లో పతాక స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ఎన్డీయేలో చేరకపోయినా.. వీలైనంతగా కేంద్రంతో సత్సంబంధాలను నెరపడానికే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను ఇచ్చింది. రాష్ట్ర ప్రగతిని దృష్టిలో ఉంచుకుని కేంద్రంతో సఖ్యంగానే మెలుగుతూ ఉంది. ఈ క్రమంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని మోడీ కేంద్ర కేబినెట్ లోకి ఆహ్వానించారనే ప్రచారం జరుగుతూ ఉంది.
ఇప్పటికే ప్రధానితో జగన్ సమావేశం ముగిసింది. ఈ క్రమంలో రేపు అమిత్ షాతో జగన్ సమావేశం కాబోతున్నారు. మోడీనే షాతో కలవాలని జగన్ కు చెప్పారని, ఈ భేటీలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రివర్గంలో చేరబోయే అంశంపై పూర్తి స్పష్టత రాబోతోందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ తన పార్టీని కేంద్ర కేబినెట్లోకి చేర్చవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ నేతలు ఈ విషయాన్ని అధికారికంగా, అనధికారికంగా ధ్రువీకరించడం లేదు. కానీ ఊహాగానాలు ఆగడం లేదు.
ఈ క్రమంలో మరింత ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కేంద్రమంత్రి కాబోతున్నారు అనేది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఉందనే ప్రచారం సాగుతూ ఉందిప్పుడు. పార్టీ తరఫున ఢిల్లీలో వ్యవహారాలను చక్కబెట్టడానికి షర్మిల తగు వ్యక్తి అనడం పెద్ద ఆశ్చర్యకరం కాదు. ఇప్పుడు షర్మిల కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకున్నా, త్వరలోనే ఆమెను రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు. కాబట్టి టెక్నికల్ గా ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పెద్దగా అడ్డంకులు లేవు. ఈ అంశంపై శుక్రవారంతో మరింత స్పష్టత రావొచ్చు. అమిత్ షాతో జగన్ సమావేశంలో మంత్రివర్గంలో చేరిక అంశమే ప్రధానంగా చర్చ జరగబోతోందనే వార్తలున్న నేపథ్యంలో.. ఈ మీటింగ్ మరింత ఆసక్తిని రేపుతూ ఉంది.