Begin typing your search above and press return to search.
చెల్లెళ్ళు గెలిచారా : జరగబోయేది అదేనటగా...?
By: Tupaki Desk | 9 July 2022 2:30 AM GMTవైసీపీలో ఫ్యామిలీ సెంటిమెంట్లు.. వాటి చుట్టూ సాగే ప్రచారం మీదనే అందరి ఆసక్తి ఉంటోంది. వైఎస్సార్ కి అసలైన వారసుడిగా జగన్ తనను తాను నిరూపించుకున్నా ఆయన వెంట అన్న వదిలిన బాణంలా చెల్లెమ్మ షర్మిలమ్మ ఉంది. ఆమె ఒక దశలో పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారు. జగన్ జైలులో పదహారు నెలలు ఉంటే ఏపీ మొత్తం చంద్రబాబుతో సమానంగా పాదయాత్ర చేసి వైసీ వైసీపీని స్ట్రాంగ్ చేశారు.
దాని ఫలితమే 2014 ఎన్నికల్లో వైసీపీ పవర్ ఫుల్ గా పోరాడింది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే షర్మిల 2019 ఎన్నికల వేళ కూడా ఏపీలో ప్రచారం చేసి వైసీపీ ఘన విజయంలో తన వంతు పాత్రను నిరూపించుకున్నారు. అయితే పార్టీ పవర్ లోకి వచ్చిన తరువాతనే అసలు కధ మొదలైంది అంటారు. షర్మిలకు పార్టీలో ప్రభుత్వంలో ప్రాముఖ్యత ఇవ్వలేదు అన్న అసంతృప్తి నుంచే ఆమె తెలంగాణా వెళ్ళి పార్టీ పెట్టారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట.
ఇందులో ఏది నిజమో కాదో తెలియదు కానీ తెలంగాణాలో షర్మిల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక ఏపీలో కనిపించలేదు. ఇక జగన్ విషయంలో విభేదాలు ఉన్నాయని ఒక టీవీ చానల్ లో ఆమె చెప్పుకున్నారు. ఏ కుటుంబంలో మాత్రం ఉండవు అని ఆమె అనడం కూడా ఇక్కడ చర్చగా సాగింది. ఇక ఆమె వెంట తల్లి విజయమ్మ నడిచి వైఎస్సార్టీపీలో ఈ రోజు దాకా ఉంటూ వచ్చారు. ఒక విధంగా ఆమె కూతురుకే ఓటేశారు అనుకోవాలి.
ఇక వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ ఆ పార్టీకి రాజీనామా చేయకుండా షర్మిల పార్టీలో కీలకంగా వ్యవహరించడమేంటి అన్న చర్చ కూడా సాగింది. ఇక జగన్ ఎటూ అధికారంలో ఉన్నారు కాబట్టి కుమార్తెకు మద్దతుగా తాను ఉండాలని విజయమ్మ భావించే ఇలా చేశారు అని కూడా చెప్పుకున్నారు. ఇపుడు వైసీపీ ప్లీనరీలో తన రాజీనామాను ప్రకటించి విజయమ్మ దాన్నే నిజం చేశారు. ఈ సందర్భంగా ఆమె షర్మిలకు తోడుగానే తాను తెలంగాణాలో ఉండాల్సి వస్తోంది అని చెప్పుకున్నారు.
ఒక విధంగా గత ఏడాదిన్నర కాలంగా విజయమ్మ అటు ఇటూ నలిగిపోయారనే అంటున్నారు. మొత్తానికి ఆమె ఇపుడు షర్మిల వైపే తాను అని బోల్డ్ డెసిషన్ తీసుకున్నాక జగన్ పార్టీకి ఆమె సేవలు ఉండవని తేలిపోయాక షర్మిల ఆ విధంగా వైసీపీ మీద పై చేయి సాధించిందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక వైఎస్సార్ జయంతికి ఒక రోజు ముందు ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్సార్ కుటుంబం మొత్తం అక్కడ అన్నీ మాట్లాడుకున్నారు అని అంటున్నారు.
ఆ మీదటనే విజయమ్మ రాజీనామా డెసిషన్ అని కూడా చెబుతున్నారు. జగన్ కి ముందే ఈ నిర్ణయం చెప్పే విజయమ్మ ప్లీనరీకి వచ్చారని కూడా అంటున్నారు. అయినా సరే జగన్ ఆమె రాజీనామా ప్రకటన తరువాత ఎమోషనల్ అయ్యారు. దాని కంటే ముందు ఆయన ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద కూడా ఎమోషనల్ గానే కనిపించారు.
ఒక విధంగా తల్లి విషయంలో షర్మిల తన పంతం నెగ్గించుకుని గెలిచారా అన్న చర్చ కూడా వస్తోంది అంటున్నారు. ఇది ఒక ఎపిసోడ్ అయితే మరో వైపు వైఎస్ వివేకానందరెడ్డి ఏకైక తనయ సునీత విషయంలో కూడా ఒక రకమైన రాజీని కుటుంబ సభ్యులు కుదిర్చారు అని అంటున్నారు. ఆమె తన తండ్రి వివేకా దారుణ హత్య మీద సీబీఐ దాకా వెళ్ళి పోరాడుతున్నారు. ఆ విషయంలో ఇండైరెక్ట్ గా ఆమె జగన్ మీద కూడా విమర్శలు చేస్తూ వచ్చారు.
ఇపుడు తండ్రి జయంతి వేళ ఇడుపులపాయ ఎస్టేట్ లో జరిగిన రాజీ చర్చలలో భాగంగా సునీతకు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఇచ్చేందుకు జగన్ అంగీకరించారు అన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఆమె వైఎస్ వివేకా రాజకీయ వారసత్వాన్ని కోరుకుంటున్నారు అంటున్నారు. దాంతో వివేకాకు పొలిటికల్ గా బలం ఎక్కువగా ఉన్న జమ్మలమడుగులో సునీతను నిలబెడతారా లేక పులివెందుల నుంచి ఆమెను పోటీ చేయిస్తారా అన్న చర్చ సాగుతోంది. లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి అయినా ఆమెకు రాజకీయ దారి చూపిస్తారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఇద్దరు చెల్లెళ్ళు గత రెండేళ్ళుగా జగన్ సర్కార్ మీద కావాలనో యాధృచ్చికమో తెలియదు కానీ పోరాడుతున్నట్లుగా మీడియాలో అయితే కధనాలు వచ్చాయి. వాటి అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ వైఎస్సార్ ఫ్యామిలీ అంతా ఒక్కటి అన్న సందేశం కోసం ఎస్టేట్ సాక్షిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు అని అంటున్నారు. అందుకే అంతా కలసి వైఎస్సార్ జయంతి వేళ కలసి నివాళి అర్పించారు అని చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఒక అన్నయ్య, ఇద్దరు చెల్లెళ్ళ పోరాటంలో చివరికి చెల్లెళ్ళు గెలిచారా అంటే జరుగుతున్న ప్రచారం నిజమైతే అదే వాస్తవం అనుకోవాలని అంటున్నారు.