Begin typing your search above and press return to search.
షర్మిల అంత మాట అన్నాక కూడా ఇంత నిశబ్దమా?
By: Tupaki Desk | 26 Feb 2021 9:30 AM GMTతెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన షర్మిలమ్మ కొత్త పార్టీ.. తరచూ ఆమెకు సంబంధించి వస్తున్న వార్తలు మరింత ఆసక్తికరంగా మారాయి. అదే సమయంలో.. ఆమె నోటి నుంచి తాజాగా వచ్చిన వ్యాఖ్య తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా.. హాట్ టాపిక్ గా మారినా.. గులాబీ నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ వ్యాఖ్యపై స్పందించటం కానీ.. ఖండించటం కానీ చేయకపోవటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న షర్మిల.. రెండు రోజుల క్రితం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో తన స్థానికత గురించి తరచూ లేవనెత్తుతున్న వారికి షాకిచ్చేలా షర్మిల నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. కేసీఆర్.. విజయశాంతిలు ఎక్కడ పుట్టారు? అన్న సూటి ప్రశ్నను వేశారు. అన్ని మీడియా సంస్థలు కాకున్నా..కొన్ని మీడియా సంస్థల్లో షర్మిల మాటల్ని భారీగా ప్రయారిటీ ఇచ్చి ప్రచురించారు.
ఇలాంటివి జరిగినప్పుడు రియాక్షన్లు వెంటనే వస్తాయి. అధికారపార్టీకి చెందిన నేతలు పలువురు స్పందించటం.. తీవ్రంగా తిట్టిపోయటం.. ఘాటుగా ఖండించటం లాంటివి కామన్. అందుకు భిన్నంగా షర్మిల లేవనెత్తిన ‘కేసీఆర్ ఎక్కడ పుట్టారు’ అన్న మాటపై అస్సలు స్పందించలేదు. ఎందుకిలా? రోటీన్ కు భిన్నంగా గులాబీ బ్యాచ్ వ్యవహరిస్తోంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
గులాబీ బాస్ ను టార్గెట్ చేసేలా కేసీఆర్ స్థానికత మీదే సూటిగా షర్మిల ప్రశ్నను సంధించినప్పుడువెంటనే రియాక్టు అయితే ఆమె మాటలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందన్న ఆలోచనలో గులాబీ బ్యాచ్ ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ స్థానికత మీద ఎక్కువ చర్చ జరిగితే.. అది తమకే డ్యామేజ్ అని.. షర్మిలను ఇగ్నోర్ చేసినట్లుగా వ్యవహరించటమే మంచిదన్న ఆలోచనలో ఉన్నారు.
తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టాలని భావిస్తున్న షర్మిలను టార్గెట్ చేస్తే.. ఒక ఆడపిల్లను విమర్శలతో వేధించటమా?అన్న సానుభూతి వస్తుందని.. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే.. ఆమె మాటల్ని లెక్కలోకి తీసుకోనట్లుగా వ్యవహరించాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ వర్గాలు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే.. అంతలా ఆవేశపడినా.. ఏ మాత్రం స్పందించకుండా కూల్ గా ఉండటం ద్వారా.. ఆమె మాటలపై ఎక్కువ చర్చ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ వ్యూహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.